వరుణ్ 'ఆపరేషన్ వాలెంటైన్'.. సడన్ ట్విస్ట్
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా సినిమాకు డిఫరెంట్ కాన్సెప్టులతో మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు
By: Tupaki Desk | 7 Dec 2023 8:06 AM GMTటాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా సినిమాకు డిఫరెంట్ కాన్సెప్టులతో మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు అతని ప్రయోగాలు అంతగా క్లిక్ కావడం లేదు. ఇక రాబోయే సినిమా విషయంలో కూడా ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఆయన నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా విడుదల వాయిదా పడింది. డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవ్వనుండగా.. వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ గురువారం ప్రకటించారు. కొత్త తేదీని త్వరలోనే వెల్లడిస్తామని సోషల్ మీడియాలో తెలిపారు.
అయితే గత కొద్దిరోజులుగా ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు రాగా.. ఇదే నిజమైంది. ఇంతవరకు ఎక్కడ ఎలాంటి ప్రచార కార్యక్రమాలు కూడా మేకర్స్ నిర్వహించలేదు. దీంతో సినిమాను ముందే వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించి సినిమా భారీగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.
భారతదేశంలోని వైమానిక దళంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఫైటర్ పైలట్‌గా ఈ చిత్రంలో కనిపించనున్నారు వరుణ్. రాడార్ ఆఫీసర్ పాత్రలో మానుషి కనిపిస్తుంది. ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి కూడా అడుగు పెట్టనున్నారు వరుణ్ తేజ్. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ ద్విభాషా చిత్రాన్ని శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నారు.
సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వరుణ్ తేజ్ మరోవైపు పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా మట్కాలో కూడా నటిస్తున్నారు. మట్కా చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో రాబోతుంది.
వరుణ్ తేజ్.. ఇటీవలే తన ప్రేయసి, హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేశారు. ఇటలీలో వీరి వివాహం అత్యంత ఘనంగా జరిగింది. అనంతరం వీరి వివాహ రిసెప్షన్ హైదరబాద్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ కొత్త జంట యూరప్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. 2017లో మిస్టర్ సినిమా కోసం వరుణ్ - లావణ్య తొలిసారి కలిసి నటించారు. అప్పుడే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ తర్వాత అంతరిక్షంలోనూ వీరి మెప్పించారు. అయితే ఈ ఏడాది కాలంలో ఇద్దరి మధ్య స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఇరు వైపు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.