ఆపరేషన్ వాలెంటైన్.. బడ్జెట్ తక్కువే..
ఈ సినిమాకి 250 కోట్ల వరకు ఖర్చు పెట్టారంట. కానీ వరుణ్ తేజ్ చేసిన ఆపరేషన్ వాలంటైన్ సినిమా కోసం ఇందులో నాలుగో వంతు బడ్జెట్ కూడా కాలేదు.
By: Tupaki Desk | 28 Feb 2024 3:44 AM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఆపరేషన్ వాలంటైన్. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను మార్చి 1న ప్రేక్షకుల ముందుకి తీసుకు రాబోతున్నారు. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న మొదటి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఇండియన్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో చాలా తెలుగు సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. వాటిలాగే ఈ మూవీ కూడా సక్సెస్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన రక్షణవ్యవస్థకి సంబందించిన కథ కావడంతో కచ్చితంగా ఎక్కువ మంది కనెక్ట్ అవుతారని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీపైన పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. తెలుగు, హిందీ భాషలలో ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. మానుషి చిల్లర్ మూవీలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో కథని చెప్పాలంటే కచ్చితంగా విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ఖర్చు అవుతుంది. రీసెంట్ గా హృతిక్ రోషన్ చేసిన ఫైటర్ మూవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 250 కోట్ల వరకు ఖర్చు పెట్టారంట. కానీ వరుణ్ తేజ్ చేసిన ఆపరేషన్ వాలంటైన్ సినిమా కోసం ఇందులో నాలుగో వంతు బడ్జెట్ కూడా కాలేదు.
కేవలం 42 కోట్ల లిమిటెడ్ బడ్జెట్ తో అద్భుతమైన విజువలైజేషన్ తో శక్తి ప్రతాప్ సింగ్ ఈ చిత్రాన్ని 75 రోజుల్లోనే కంప్లీట్ చేసారంట. తక్కువ సమయంలో తక్కువ బడ్జెట్ తో మూవీ చేసినందు వలన మెగాస్టార్ కూడా శక్తి ప్రతాప్ సింగ్ ప్లానింగ్ ని మెచ్చుకున్నారు. ట్రైలర్ చూస్తుంటే క్వాలిటీ పరంగా హైస్టాండర్డ్స్ లో ఉంది. వంద కోట్లు బడ్జెట్ అన్నా కూడా ఈజీగా నమ్మేలా విజువల్స్ ఉన్నాయి.
టాలీవుడ్ లో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి ఈ స్థాయిలో బడ్జెట్ ఖర్చు పెట్టేస్తున్నారు. అలాంటిది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన ఎయిర్ వార్ సీక్వెన్స్ తో 42 కోట్ల బడ్జెట్ తో ఆపరేషన్ వాలంటైన్ మూవీ చేయడం నిజంగా గొప్ప విషయమని చెప్పాలి.