వరుణ్ తేజ్… బిజినెస్ ట్రాక్ ఎలా ఉందంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఈరోజు రిలీజ్ అవుతోంది
By: Tupaki Desk | 1 March 2024 4:05 AM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఈరోజు రిలీజ్ అవుతోంది. భారీ బడ్జెట్ తో రియలిస్టిక్ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథనం ఉండబోతోంది. మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. అలాగే థీయాట్రికల్ బిజినెస్ కూడా 17 కోట్ల వరకు జరిగింది. కానీ వరుణ్ తేజ్ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాకు జరిగిన బిజినెస్ తక్కువ అని చెప్పాలి. దీనికి కారణం ఇంతకుముందు వచ్చిన గని, గాండీవ దారి అర్జున డిజాస్టర్స్ ఎఫెక్ట్ అనే మాట వినిపిస్తోంది. వరుణ్ తేజ్ కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్ జరిగిన మూవీ అంటే గని అని చెప్పాలి. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ జోనర్ లో ఈ సినిమా రావడంతో ఏకంగా 25.30 కోట్ల బిజినెస్ జరిగింది. అయితే మూవీ డిజాస్టర్ కావడంతో భారీ నష్టాలు తప్పలేదు.
దీని తర్వాత సెకండ్ హైయెస్ట్ బిజినెస్ గద్దలకొండ గణేష్ సినిమాపై జరిగింది. 24.25 కోట్లకి థీయాట్రికల్ రైట్స్ అమ్ముడు కాగా, బయ్యర్లకు మూవీ మంచి లాభాలను అందించింది. అలాగే వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన తొలిప్రేమ సినిమాపై కూడా 23 కోట్ల వ్యాపారం జరిగింది. సినిమా కూడా హిట్ టాక్ సొంతం చేసుకుని మంచి లాభాలు అర్జించింది.
గని డిజాస్టర్ ఎఫెక్ట్ గాండీవదారి అర్జున సినిమాపై పడింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన ప్రవీణ్ సత్తారుకి దీనికంటే ముందుగా ది ఘోస్ట్ సినిమాతో డిజాస్టర్ వచ్చింది. ఆ ప్రభావం కూడా గాండీవదారి అర్జున వ్యాపారం తగ్గడానికి కారణం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 17 కోట్ల బిజినెస్ మాత్రమే ఈ మూవీ చేయగలిగింది. ఈ కలెక్షన్స్ ని కూడా సినిమా అందుకోలేక డిజాస్టర్ జాబితాలో చేరిపోయింది.
ఇప్పుడు వచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఇప్పటివరకు టాలీవుడ్ లో టచ్ చేయని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ కావడం కూడా మూవీ బిజినెస్ తగ్గడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. అయితే ఇండస్ట్రీలో చూసిన వారి నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ రావడం విశేషం. తెలుగు, హిందీ భాషలలో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకోవడం పెద్ద కష్టమైన విషయం కాకపోవచ్చనే మాట ట్రేడ్ పండితుల నుంచి వినిపిస్తోంది.