Begin typing your search above and press return to search.

ఆపరేషన్ వాలెంటైన్ సెన్సార్ రిపోర్ట్.. ఎలా ఉందంటే..

ఈ సినిమాకు తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంగా సెన్సార్ అధికారుల నుండి U/A సర్టిఫికేట్ దక్కింది.

By:  Tupaki Desk   |   28 Feb 2024 12:24 PM GMT
ఆపరేషన్ వాలెంటైన్ సెన్సార్ రిపోర్ట్.. ఎలా ఉందంటే..
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్‌. ఈ సినిమాలో వరుణ్ వింగ్ కమాండర్ రుద్రగా కనిపించనున్నాడు. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిన ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిమాచారు. ఇక ఓ వర్గం ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మొత్తానికి సినిమా ఈ గురువారం వరల్డ్ వైడ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇక సెన్సార్ పనుల్ని కూడా ఫినిష్ చేసుకున్నారు. ఈ సినిమాకు తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంగా సెన్సార్ అధికారుల నుండి U/A సర్టిఫికేట్ దక్కింది. నిజజీవితంలో మన ఎయిర్ ఫోర్స్ సైన్యం ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగా ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్స్ కు కూడా మంచి రెస్పాన్స్ దక్కింది.

ఇక మరికొన్ని గంటల్లో సినిమా ప్రీమియర్స్ తో బాక్సాఫీస్ వద్ద సందడిని స్టార్ట్ చేయబోతోంది. సినిమా రన్ టైమ్ కూడా లాక్ అయ్యింది. 2:04 గంటలుగా సినిమా నిడివి ఫిక్స్ అయినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా తెలియజేసింది. నిజానికి ఈ జానర్‌లో వచ్చే సినిమాలకు ఇది సరైన రన్‌టైమ్ అని చెప్పవచ్చు. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన దేశభక్తి చిత్రం.

రియల్ లైఫ్ లో యదార్థ సంఘటనలను చాలా వాస్తవికంగా చూపించడానికి మేకర్స్ ప్రయత్నించారు. షూటింగ్ కంటే ముందే భారత వైమానిక దళాలకు సంబంధించిన ఎంతో రీసెర్చ్ చేశారు. అంతే కాకుండా బెస్ట్ అవుట్ ఫుట్ ను అందించేందుకు ముందుగానే బడ్జెట్ ప్లాన్ వేసుకున్నారు. అందువల్ల సినిమాను జెట్ స్పీడ్ లోనే ఫినిష్ చేశారు. ఈ సినిమా కోసం దాదాపు 40 కోట్ల రేంజ్ బడ్జెట్ లోనే ఖర్చు పెట్టినట్లు టాక్.

అయినప్పటికీ అంతకంటే ఎక్కువ స్థాయిలో ఖర్చు చేసిన చిత్రంగా ట్రైలర్ విజువల్స్ హైలెట్ అయ్యాయి. దీన్నిబట్టి దర్శకుడు చిత్ర యూనిట్ వర్క్ ఏ తరహాలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సినిమాల్ థ్రిల్లింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు ప్రభావాన్ని చూపుతుంది. పుల్వామా సంఘటనకు సంబంధించిన విజువల్స్ ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు హృదయాలను బరువెక్కేలా చేస్తాయట. ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్, ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ అంతకుమించి ఉంటాయని తెలుస్తోంది.