ఆపరేషన్ వాలెంటైన్.. బాక్సాఫీస్ వద్ద ఎంత రావాలి
ఎక్కువగా ప్రయోగత్మకమైన సినిమాలే చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా రాబోతోంది
By: Tupaki Desk | 29 Feb 2024 7:30 AM GMTప్రతిసారి డిఫరెంట్ కంటెంట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వరుణ్ తేజ్ కొన్నిసార్లు ఊహించని చేదు అనుభవాలను కూడా ఎదుర్కొంటున్నాడు. అయినప్పటికీ కూడా అతని ప్రయోగాల్లో మాత్రం అసలు ఆగడం లేదు. వీలైనంత వరకు కొత్త తరహా కదులను సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. ఒక సినిమా ఫ్లాప్ అయినా కూడా మళ్లీ నెక్స్ట్ సేఫ్ జోన్ లోకి రావాలని రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయాలని అనుకోవడం లేదు.
ఎక్కువగా ప్రయోగత్మకమైన సినిమాలే చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా రాబోతోంది. యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా పుల్వామా దాడుల నేపథ్యంలో తెరకెక్కింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ సినిమాను గట్టిగానే విడుదల చేస్తున్నారు.
ఇక ఈ సినిమా బిజినెస్ కూడా డీసెంట్ గానే జరిగినట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ముందుగా నాన్ థియేట్రికల్ గానే దాదాపు 23 కోట్ల వరకు ఆదాయాన్ని తీసుకొచ్చినట్లు సమాచారం. ఇక థియేట్రికల్ గా గా చూసుకుంటే ఈ సినిమా ఏరియా లవారీగా చేసిన బిజినెస్ ఈ విధంగా ఉంది. నైజంలో 4.5 కోట్లు దర పలికిన ఈ సినిమా సీడెడ్ లో 2 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఆంధ్ర ఏరియా మొత్తంలో కూడా 7.5 కోట్ల రేంజ్ లో దర పలికినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తంగా చూసుకుంటే ఆపరేషన్ వాలెంటైన్ సినిమా 14 కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ మొత్తంగా అటువైపుగా సినిమా 3 కోట్ల వరకు వ్యాపారం చేయగా టోటల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 17 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.
నైజాం: 4.5 కోట్లు
సీడెడ్: 2 కోట్లు
ఆంధ్ర: 7.5 కోట్లు
ఏపీ తెలంగాణ: 14 కోట్లు
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్: 3 కోట్లు
వరల్డ్ వైడ్: 17 కోట్లు
అంటే ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే బాక్సాఫీస్ వద్ద 18 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. అయితే వరుణ్ తేజ్ గత రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాలేదు. దాదాపు ఇదే రేంజ్ లో బిజినెస్ చేసినప్పటికీ అందులో సగానికి సగం కూడా వెనక్కి తీసుకురాలేకపోయాయి. కాబట్టి ఈ సినిమా తో వరుణ్ తేజ్ తప్పనిసరిగా సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఓపెనింగ్స్ ఎలా వస్తాయో చూడాలి.