ఈ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ హిందీ బెల్ట్‌లోను ప్లస్!
ప్రీమియర్లతో పాజిటివ్ టాక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ కానుంది. నైజాంలో షోల నుంచి గుడ్ టాక్ వినిపించింది. దీంతో ఇప్పుడు హిందీ బెల్ట్ లో కూడా వర్కవుటవుతుందనే అంచనాలు పెరిగాయి.
By: Tupaki Desk | 1 March 2024 4:15 AM GMTయాధృచ్ఛికమే అయినా కానీ కేవలం కొన్ని వారాల వ్యవథిలోనే యుద్ధ విమానాలు సాహసవీరుల కథలతో రూపొందించిన రెండు సినిమాలు విడుదలవ్వడం దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తోంది. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ నటించిన -ఫైటర్... మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వేలెంటైన్ యుద్ధ విమానాల నేపథ్యంలో సాహసాల కథలే. ఇవి రెండూ వారాల వ్యవధిలో విడుదలవ్వడంతో అభిమానుల్లో వీటిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
భారీ అంచనాల నడుమ అత్యంత భారీగా రూపొందిన హృతిక్ 'ఫైటర్' ఇటీవల విడుదలై ఊహించని విధంగా ఫ్లాపైంది. చెత్త సినిమా అని తీసిపారేయకపోయినా కానీ జనాల్ని థియేటర్లకు రప్పించడంలో ఫైటర్ విఫలమైంది. అయితే ఇప్పుడు యుద్ధ విమానాల నేపథ్యంలో సర్జికల్ స్ట్రైక్స్ కథతో రూపొందించిన వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వేలెంటైన్' కి డే వన్ లో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రీమియర్లతో పాజిటివ్ టాక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ కానుంది. నైజాంలో షోల నుంచి గుడ్ టాక్ వినిపించింది. దీంతో ఇప్పుడు హిందీ బెల్ట్ లో కూడా వర్కవుటవుతుందనే అంచనాలు పెరిగాయి. అయితే దీనిని హిందీ ఆడియెన్ ని దృష్టిలో ఉంచుకుని చేయలేదని తెలుగు ఆడియెన్ తన ప్రధాన లక్ష్యమని వరుణ్ తేజ్ ఇటీవల ఇంటర్వ్యూలో అన్నారు. కానీ కంటెంట్ బావుంటే అక్కడా విజయం సాధించడం కష్టం కాదు. ఇటీవలి కాలంలో తెలుగు సినిమాలు పాన్ ఇండియా మార్కెట్లో గొప్ప విజయాలు అందుకుంటున్నాయి.
పాన్ ఇండియాలోను హీరో ముఖ విలువ కంటే కంటెంట్ ఏల్తోంది. దీనికి తేజ సజ్జా 'హను-మాన్' సక్సెస్ పెద్ద ఉదాహరణ. ఇటీవల చిన్న హీరోలు, పెద్ద హీరోలు అనే తేడా లేకుండా హిందీ బెల్ట్ లో ఆడియెన్ మంచి సినిమాలను ఆదరించడం అన్ని విధాలా కలిసొచ్చే అంశం. ఇప్పుడు ఆపరేషన్ వేలెంటైన్ కి ఇది ప్లస్ కానుంది. సంచలనం సృష్టించిన బాలాకోట్, పుల్వామా దాడుల నేపథ్యంలో తీవ్రవాదం అంశాలను టచ్ చేస్తూ రూపొందించిన వారియర్ సినిమా కాబట్టి 'ఆపరేషన్ వేలెంటైన్' అటు ఉత్తరాదినా బాగా కనెక్టయ్యేందుకు ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు. టాలీవుడ్ లో ఆరడుగుల గ్రీక్ గాడ్ ఎవరు? అంటే వరుణ్ తేజ్ పేరే వినిపిస్తోంది. కాబట్టి ఇది కూడా అక్కడా ప్లస్ కానుందనే భావిద్దాం. ఈ శుక్రవారం (మార్చి 1న) విడుదలైన ఆపరేషన్ వేలెంటైన్ 'సమీక్ష' కోసం ఇక్కడ వేచి చూడండి.