ఆపరేషన్ వాలంటైన్.. ఈ సెంటిమెంట్ కలిసొచ్చేనా?
మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా ఈ వేడుక జరగడం విశేషం. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నైజాంలో రిలీజ్ చేస్తోంది.
By: Tupaki Desk | 26 Feb 2024 3:54 AM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆపరేషన్ వాలంటైన్ తెలుగు, హిందీ భాషలలో రిలీజ్ కాబోతోంది. మార్చి 1న ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేయనుంది. భారీ బడ్జెట్ తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథని శక్తి ప్రతాప్ ఆవిష్కరించారు. వరుణ్ తేజ్ ఎయిర్ ఫైటర్ గా ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు.
పుల్వామా ఘటన తర్వాత పాకిస్థాన్ పై ఇండియా చేసిన ఎయిర్ ఎటాక్ సంఘటనల స్ఫూర్తితో ఈ కథని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మానుషీ చిల్లర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా ఈ వేడుక జరగడం విశేషం. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నైజాంలో రిలీజ్ చేస్తోంది. వరుణ్ తేజ్ చివరిగా గని, గాండీవదారి అర్జున సినిమాలతో డిజాస్టర్ లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆపరేషన్ వాలంటైన్ మూవీ మాత్రం చాలా నమ్మకంతో చేశాడు. మరోసారి స్క్రిప్ట్ సెలక్షన్స్ విషయంలో తన టేస్ట్ వేరుగా ఉంటుందని ఈ మూవీతో చూపించబోతున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్ సలార్ చిత్రాన్ని నైజాంలో రిలీజ్ చేసింది. ఈ మూవీని 65 కోట్లకి కొనుగోలు చేసింది. ఓవరాల్ గా 70 కోట్లు కలెక్ట్ చేసి మైత్రీ వారికి లాభాలు అందించింది. ఇక సంక్రాంతికి హనుమాన్ సినిమాని నైజాంలో మైత్రీ వారే రిలీజ్ చేశారు. ఈ సినిమాని 7.8 కోట్లకి కొనుగోలు చేస్తే ఏకంగా 38 కోట్ల షేర్ వచ్చింది. మైత్రీ వారికి భారీ లాభాలని ఈ ఏడాది ఆరంభంలోనే హనుమాన్ అందించింది.
ఇప్పుడు ఆపరేషన్ వాలంటైన్ నైజాం రైట్స్ ని మైత్రీ డిస్టిబ్యూటర్స్ సొంతం చేసుకున్నారు. ఈ సమయంలో వరుణ్ తేజ్ కి కచ్చితంగా హిట్ కావాలి. మూవీకి పాజిటివ్ టాక్ వచ్చి కమర్షియల్ సక్సెస్ అయితే మాత్రం తెలుగు, హిందీ భాషలలో కచ్చితంగా భారీ కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. అయితే ప్రయోగాత్మక కథలకి తెలుగులో పెద్దపీట వేసేది తక్కువ. మైత్రీ డిస్టిబ్యూటర్స్ కి ఉన్న లక్కీ హ్యాండ్ ఏమైనా వరుణ్ తేజ్ కి కలిసొచ్చి ఆపరేషన్ వాలంటైన్ కి భారీ వసూళ్లు వస్తాయేమో చూడాలి.