Begin typing your search above and press return to search.

ఇండియా గాంధీదే కాదు.. బోస్‌ది కూడా..

వరుణ్, మానుషి జెట్ ఫైటర్స్ గా కనిపించబోతున్న ఈ మూవీ టీజర్ కంప్లీట్ యాక్షన్ కట్ తో టీజర్ అదిరిపోయింది

By:  Tupaki Desk   |   18 Dec 2023 11:46 AM GMT
ఇండియా గాంధీదే కాదు.. బోస్‌ది కూడా..
X

డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినీ ప్రియులను మెప్పించే ప్రయత్నం చేస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను ఫస్ట్ స్ట్రైక్ పేరుతో మేకర్స్ విడుదల చేశారు.


వరుణ్, మానుషి జెట్ ఫైటర్స్ గా కనిపించబోతున్న ఈ మూవీ టీజర్ కంప్లీట్ యాక్షన్ కట్ తో టీజర్ అదిరిపోయింది. “మ‌న ఎయిర్ ఫోర్స్‌ను ఇంకొక దేశంలోకి పంపించడమంటే ఇట్స్ ఏ డిక్లరేషన్ ఆఫ్ వార్. ఇలా ప్ర‌తీకారం తీర్చుకుంటూ పోతే దేశాలు ఉండ‌వు బార్డ‌ర్స్ మాత్రమే ఉంటాయి” అంటూ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఓవ‌ర్‌తో టీజర్ మొద‌ల‌వుతుంది.

“శత్రువులకు ఒక విషయం గుర్తు చేయాల్సిన అవసరం వచ్చింది. మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్‌ది కూడా” అనే డైలాగ్ చెబుతూ యుద్దానికి సిద్దమవుతున్న సైనికుడిగా వరుణ్ వావ్ అనిపించారు. టీజర్ లో ఇండియా పై ఓ భీకర దాడి జరిగినట్లు చూపించారు. ఆ తర్వాత దీనికి బదులుగా భారత్ అతిపెద్ద వైమానిక దాడి చేసినట్టు వీడియో చుస్తే స్పష్టం అవుతోంది.

యుద్ధ విమానాల విన్యాసాలు టీజర్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మధ్యలో వరుణ్, మానుషీ లవ్ కెమిస్ట్రీను కూడా చూపించారు. మానుషీ క్యూట్ లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. మొత్తానికి ఈ టీజర్ తో మూవీపై మంచి అంచనాలు క్రియేట్ చేశారు మేకర్స్. తెలుగు, హిందీ భాషల్లో దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, రినైసన్స్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ కానున్న ఈ చిత్రంతో బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టనున్నారు వరుణ్ తేజ్. కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో సతమతమవుతున్న వరుణ్ కు ఆపరేషన్ వాలెంటైన్ మూవీ కీలకంగా మారింది. ఈ సినిమాతో ఎలాగైనా మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలనే వరుణ్ చూస్తున్నారు. మరి ఈ సినిమా వరుణ్ తేజ్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో మరి.