Begin typing your search above and press return to search.

ఓపెన్ హైమర్ చూశాక దిగ్భ్రాంతికి గురయ్యాను

ఒపెన్ హైమర్ నటులు ఎమిలీ బ్లంట్ -ఫ్లోరెన్స్ పగ్

By:  Tupaki Desk   |   14 July 2023 4:39 AM GMT
ఓపెన్ హైమర్ చూశాక దిగ్భ్రాంతికి గురయ్యాను
X

''సిలియన్ మర్ఫీ మహదాద్భుత నటప్రదర్శన.. గొప్ప స్థాయిలో ఒక పాత్రపై అధ్యయనం... ఒక చారిత్రక డ్రామాని తెరకెక్కించిన తీరు అసాధారణం. స్పష్టంగా నోలన్ సెన్సిబిలిటీస్ తో తెరకెక్కిన ఈ సినిమా చూస్తున్నంతసేపూ టెన్షన్ ... స్ట్రక్చర్.. సెన్స్ ఆఫ్ స్కేల్.. ఆశ్చర్యపరిచే సౌండ్ డిజైన్ విశేషమైన విజువల్స్... వావ్ అనిపిస్తాయి...''. ఇదీ 'ఇన్సెప్షన్' ఫేం క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వం వహించి 'ఓప్పెన్ హైమర్' పై ఒక విదేశీ సమీక్షకుని ముందస్తు రివ్యూ.

అణుబాంబ్ తయారీ విస్పోటన విధ్వంశం నేపథ్యంలో అమెరికన్ న్యూక్లియర్ సైంటిస్ట్ ఓప్పెన్ హైమర్ జీవితకథను తెరపై ఆవిష్కరించారు నోలాన్. ఈనెల 21న భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అణుబాంబ్ సృష్టికర్త రాబర్ట్ ఓపెన్ హైమర్ లైఫ్ జర్నీలో ఎన్నో విశేషాలను నాటి రాజకీయాలను తెరపై ఆవిష్కరించగా ఆ పాత్రకు సిసిలియన్ మర్ఫీ ప్రాణం పోసారని పలువురు విదేశీయులు (నెటిజనులు) ట్విట్టర్ లో సమీక్షించారు.

ఇక ఈ సినిమాకి సౌండ్ డిజైన్.. నేపథ్య సంగీతం మరో లెవల్ అని కీర్తిస్తున్నారు. అలాగే సినిమాలో ఒక కీలక పాత్రలో ఎమిలీ బ్లంట్ పెర్ఫామెన్స్ కి ముగ్ధులైపోవడం ఖాయమని సమీక్షించారు. ముఖ్యంగా తొలి రెండు గంటలు సినిమా హృదయాలకు హత్తుకుంటుందని చివరి 60 నిమిషాల్ని ప్రేక్షకులు అంగీకరించలేని రీతిలో నోలాన్ తెరకెక్కించారని కూడా కొందరు విమర్శకులు సమీక్షించారు. అయితే నోలాన్ మార్క్ సినిమా ఆద్యంతం హైలైట్ గా కనిపిస్తుందని ప్రశంసలు కురిపించారు.

ఇదేమీ 'మిషన్ ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్' తరహాలో భారీ స్టంట్స్ యాక్షన్ అడ్వెంచర్స్ ఉన్న సినిమా కాదు. ఇది కేవలం ఒక బయోపిక్. సైంటిస్ట్ జీవితకథతో తెరకెక్కిన సినిమా.

ఇందులో సుదీర్ఘమైన సంభాషణలు వాటిలో డెప్త్ అర్థం చేసుకున్నవారికి ఈ సినిమా కథ బాగా కనెక్ట్ అవుతుందని ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా టెనెట్ లా కన్ఫ్యూజన్ లేని స్క్రీన్ ప్లేతో సామాన్యులకు కూడా అర్థమయ్యేలా ఓపెన్ హైమర్ ని నోలాన్ తెరకెక్కించారని విమర్శకులు అంటున్నారు.

ఒపెన్ హైమర్ నటులు ఎమిలీ బ్లంట్ -ఫ్లోరెన్స్ పగ్ లండన్ లో జరిగిన ప్రీమియర్ కి అటెండయ్యారు. ఈ ప్రివ్యూ నుంచి పలువురు సమీక్షలను సోషల్ మీడియాల్లో షేర్ చేసారు. నోలాన్ కెరీర్ లో మరో క్లాసిక్ అందరినీ అలరించనుందని పాజిటివ్ సమీక్షలను పోస్ట్ చేసారు. అయితే ఈ సినిమా భారతీయుల సెన్సిబిలిటీస్ కి ఏమేరకు కనెక్టవుతుంది? అన్నది వేచి చూడాలి.