Begin typing your search above and press return to search.

'ఓపెన్ హైమ‌ర్' కి కేంద్ర‌స‌మాచార శాఖ హెచ్చ‌రిక‌

ప‌విత్ర గంధాల్ని సినిమాలో చూపించి బిజినెస్ చేసుకోవ‌డం కోసం

By:  Tupaki Desk   |   24 July 2023 11:09 AM GMT
ఓపెన్ హైమ‌ర్ కి కేంద్ర‌స‌మాచార శాఖ హెచ్చ‌రిక‌
X

హాలీవుడ్ మూవీ' ఓపెన్ హైమ‌ర్' పై భార‌త్ నుంచి సరత్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతోన్న సంగ‌తి తెలిసిందే. హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీశారంటూ ఆగ్ర‌హ జ్వాల‌లు ర‌గులుతున్నాయి. సినిమాను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ నడుస్తోంది. సినిమాలో ప్లోరెన్స్ ప‌గ్- జీన్ టాట్ లాక్ మ‌ధ్య ఓ శృంగార స‌న్నివేశమే ఈ వివాదానికి దారి తీసింది. తీస్తే శృంగార స‌న్నివేశం తీసారు. అందులోభగవద్గీత చదువుతూ మ‌రీ ఆ సన్నివేశాలు ఉంటాయి. దీంతో హిందువులంతా సినిమాపై ఉక్కు పిడికిలి బిగించారు.

ప‌విత్ర‌గ్రంధ‌మైన భ‌గ‌వ‌ద్గీత‌ని చ‌ద‌వ‌డం ఏంటి? డైరెక్ట‌ర్ బుర్ర ఉందా? అంటూ మండిప‌డు తున్నారు. ఈ ఒక్క స‌న్నివేశంలోనే కాదు.. సినిమాలో భగవద్గీత చాలా చోట్ల క‌నిపిస్తుంది. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటి జ‌నులు డైరెక్ట‌ర్ పై మండిప‌డుతున్నారు. ప‌విత్ర గ్రంధాన్నిఅలాంటి స‌న్నివేశాల్లో చ‌దివి అపవిత్రం చేస్తారా? మీ మ‌తానికి సంబంధించిన పుస్త‌కాల్ని అలాంటి స‌న్నివేశాల్లో చూపిస్తే ఊరుకుంటారా? పేరున్న ద‌ర్శ‌కుడైతే ఇష్టాను సారం సినిమాలు చేస్తే ఇండియాలో బ్యాన్ చేస్తామంటూ! హెచ్చ‌రిక‌లు జారీ అయ్యాయి.

ఈ వివాదం..విష‌యం కేంద్ర స‌మాచార శాఖ దృష్టికి వెళ్లింది. దీంతో ఆ శాఖ‌కి చెందిన క‌మీష‌న‌ర్ ఉద‌య్ మ‌హుర్క‌ర్ కూడా హెచ్చ‌రించారు. త‌క్ష‌ణం సినిమాలో ఆ స‌న్నివేశాలు తొల‌గించాల‌ని లేదంటే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు. ఆయ‌న వార్నింగ్ తో నెటి జ‌నులు మ‌రింత గా ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ఇలాంటి సినిమాలు ఇండియాలో రిలీజ్ చేయ‌కూడ‌ద‌ని.. ప‌విత్ర గంధాల్ని సినిమాలో చూపించి బిజినెస్ చేసుకోవ‌డం కోసం..ప్ర‌చారం కోసం ఇలాంటి ప‌నులకు తెగ‌బ‌డుతు న్నార‌ని...ఇవ‌న్నీ దేశ ద్రోహ చ‌ర్య‌ల‌కు కింద‌కు వ‌స్తాయ‌ని నెటి జ‌నులు పోస్ట్ల రూపంలో త‌మ అభిప్రాయాల్ని తెలుపుతున్నారు. ఇలాంటి చ‌ర్య‌ల‌న్నీ భార‌తదేశాన్ని చుల‌క‌న‌గా చేస్తున్నాయ‌ని మండిప‌డుతున్నారు. దీనికి తక్ష‌ణం చిత్ర ద‌ర్శ‌కుడు భార‌తేదేశానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు.