Begin typing your search above and press return to search.

ఇలాంటి సినిమా భార‌త‌దేశంలో 100కోట్లు న‌మ్మ‌శ‌క్యం కానిది

నాన్ ఫ్రాంఛైజీ కేట‌గిరీలో వ‌చ్చిన ఈ సినిమా భార‌త‌దేశం నుంచి 100 కోట్లు వ‌సూలు చేయ‌డొ ఒక సంచ‌ల‌నం.

By:  Tupaki Desk   |   19 Aug 2023 4:15 AM GMT
ఇలాంటి సినిమా భార‌త‌దేశంలో 100కోట్లు న‌మ్మ‌శ‌క్యం కానిది
X

క్రిస్టోఫ‌ర్ నోలాన్ తెర‌కెక్కించిన 'ఒపెన్‌హైమర్' భారతీయ బాక్సాఫీసు వద్ద విస్ఫోటన విజయం సాధించింది. నాన్ ఫ్రాంఛైజీ కేట‌గిరీలో వ‌చ్చిన ఈ సినిమా భార‌త‌దేశం నుంచి 100 కోట్లు వ‌సూలు చేయ‌డొ ఒక సంచ‌ల‌నం. ఈ చిత్రం రెండవ వారంలో 35.50 కోట్లు వ‌సూలు చేసింది. రెండు వారాల మొత్తం రూ. 121 కోట్లు భార‌త్ నుంచి వ‌సూలు చేసింద‌ని స‌మాచారం. నిజానికి నోల‌న్ చిత్రం మొదటి వారంతో పోలిస్తే రెండో వారంలో కేవలం 59 శాతం పడిపోయింది. ఇది బలమైన ఓపెనింగులు సాధించిన ఈ చిత్రం రెండో వారంలోను అద్భుతమైన హోల్డ్ ని సాధించింది. గురువారానికి కేవలం 50 శాతానికి త‌గ్గినా కానీ వీకెండ్ ల‌ ఇది మెరుగుపడుతుంది. ఈ సినిమా భార‌త్ నుంచి అత్యధిక వసూళ్లు రాబట్టిన హాలీవుడ్ చిత్రంగా అవతరించడానికి 12 కోట్లు వ‌సూలు చేయాలి. ఇటీవ‌లి బ్లాక్ బ‌స్ట‌ర్ ఫాస్ట్ X దాదాపు 132 కోట్లు వసూలు చేసింది. ఈ ఆదివారం నాటికి నోలాన్ చిత్రం ఈ స్థాయిని అందుకోగ‌ల‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు.

నెట్ కలెక్షన్ల పరంగా ఓపెన్ హైమ‌ర్ రెండు వారాల్లో 99.50 కోట్లు వ‌సూలు చేయ‌గా.. ప్రతిష్టాత్మకమైన రూ. 100 కోట్ల మార్క్ ని దాదాపు అందుకుంది. ఈ చిత్రం మూడవ శుక్రవారం నాడు మూడు అంకెల మైలురాయిని అధిగమించింది. ఓపెన్ హైమర్ కంటే ముందు మరో పన్నెండు హాలీవుడ్ చిత్రాలు భారతదేశంలో 100 కోట్ల NETT సాధించాయి. అవన్నీ యాక్షన్-అడ్వెంచర్ ఫ్రాంచైజీ చిత్రాలు. మూడు గంటల టాకీతో బయోపిక్ డ్రామా టాప్ 10 లీగ్ లో చేరడం సిస‌లైన విజ‌యంగా క‌నిపిస్తోంది. భారతదేశంలో నోలన్ కి ఉన్న ఇమేజ్ దీనికి నిదర్శనంగా నిలుస్తుంది.

Oppenheimer విజయానికి IMAX ఫార్మాట్ గొప్ప స‌హ‌కారం అందించింద‌ని కూడా ట్రేడ్ విశ్లేషిస్తోంది. కేవలం 24 IMAX స్క్రీన్‌లు భారతదేశంలోని మొత్తం వ‌సూళ్ల‌లో 24 శాతాన్ని అందించాయి. రెండవ వారంలో పెద్ద-స్క్రీన్ ఫార్మాట్ షేర్ దాదాపు 40 శాతానికి పెరిగింది. IMAX వెర్షన్ ప్రామాణిక వెర్షన్ కంటే మెరుగ్గా ఉన్నందున రాబోయే వారాల్లోను విజ‌య‌వంత‌మైన ర‌న్ కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం భారతదేశంలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన IMAX విడుదలగా అవతరించింది. ఇది అవతార్ 2 రికార్డును అధిగమించే వీలుంద‌ని అంచ‌నా.

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద క‌లెక్ష‌న్లు: మొదటి వారం: రూ. 85.50 కోట్లు, 2వ శుక్రవారం: రూ. 5.50 కోట్లు, 2వ శనివారం: రూ. 9 కోట్లు, 2వ ఆదివారం: రూ. 9 కోట్లు, 2వ సోమవారం: రూ. 3.25 కోట్లు, 2వ మంగళవారం: రూ. 3 కోట్లు, 2వ బుధవారం: రూ. 3 కోట్లు, 2వ గురువారం: రూ. 2.75 కోట్లు, మొత్తం: రూ. 121 కోట్లు వ‌సూలైంది.

ఓపెన్‌హీమర్ సినిమా గురించి....వివ‌రాల్లోకి వెళితే.. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ చిత్రమిది. అమెరికా-మాన్‌హాటన్ ప్రాజెక్ట్ సమయంలో మొదటి అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయడంలో సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త అయిన J. రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవిత క‌థ ఆధారంగా రూపొందింది. ఒపెన్‌హైమర్‌గా సిలియన్ మర్ఫీ, అతని భార్యగా ఎమిలీ బ్లంట్, జనరల్ లెస్లీ గ్రోవ్స్‌గా మాట్ డామన్ .. లూయిస్ స్ట్రాస్‌గా రాబర్ట్ డౌనీ జూనియర్ నటించారు. ఫ్లోరెన్స్ పగ్, రామి మాలెక్, కెన్నెత్ బ్రనాగ్ త‌దిత‌రులు ఇత‌ర‌ పాత్ర‌లు పోషించారు.