Begin typing your search above and press return to search.

శృంగారం స‌న్నివేశంలో 'గీతా ప‌ఠనం' తెలిసీ సెన్సార్ లైట్?

ఆసక్తికరంగా మర్ఫీతో శృంగారంలో మునిగితేలే స‌న్నివేశంలో న‌టి పగ్ భగవద్గీతను చదివే దృశ్యం ఈ చిత్రంలో అలాగే మిగిలిపోయింది

By:  Tupaki Desk   |   22 July 2023 4:05 AM GMT
శృంగారం స‌న్నివేశంలో గీతా ప‌ఠనం తెలిసీ సెన్సార్ లైట్?
X

క్రిస్టోఫ‌ర్ నోలాన్ తెర‌కెక్కించిన బ‌యోపిక్ సినిమా 'ఓపెన్ హైమ‌ర్' భారీ అంచ‌నాల న‌డుమ‌ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై క్రిటిక్స్ ప్రేక్ష‌కుల‌ నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అణు బాంబు పితామ‌హుడు.. అమెరిక‌న్ భౌతిక శాస్త్రవేత్త J. రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితం నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే చిత్ర‌మిది. కీలకమైన లాస్ అలమోస్ లాబొరేటరీకి డైరెక్టర్ గా పనిచేసిన‌ ఓపెన్ హైమర్ 1942 -1946 మధ్య అణ్వాయుధాలను రూపొందించడంపై దృష్టి సారించిన మేధావి.

ప్రభుత్వ పరిశోధనలో భాగంగా మాన్ హట్టన్ ప్రాజెక్ట్ లో అత‌డు ప్రధాన పాత్ర పోషించారు. అణుబాంబ్ త‌యారీ దాని ప్ర‌యోగంలో కీల‌క సైంటిస్ట్ అయిన ఓపెన్ హైమ‌ర్ క‌థ‌ను నోల‌న్ అద్భుతంగా తెర‌కెక్కించారు.

అయితే ఈ చిత్రంలో టైటిల్ పాత్ర‌ను పోషించిన సిలియ‌న్ మ‌ర్ఫీకి లీడ్ పాత్ర‌లో అద్భుత‌మైన అవ‌కాశం అన‌డంలో సందేహం లేదు. అయితే న‌టి ఫ్లోరెన్స్ పగ్ ఒపెన్ హైమర్ మాజీ భార్య జీన్ టాట్ లాక్ పాత్ర‌లో న‌టించింది.

ఈ పాత్ర‌ను నోలాన్ ఎంతో నైపుణ్యంతో చిత్రీకరించాడ‌ని క్రిటిక్స్ నుంచి ప్ర‌శంస‌లు కురిసాయి. ఓపెన్ హైమ‌ర్ చిత్రం విడుదలకు ముందు మర్ఫీ సుదీర్ఘ నగ్నత్వం సాన్నిహిత్యానికి సంబంధించిన‌ సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయ‌ని నోల‌న్ వెల్లడించారు.

అయితే భారతీయ ప్రేక్షకులు సినిమా చూడటానికి థియేటర్ లకు తరలి రావాలంటే వాటిని తొల‌గించాల్సి వ‌చ్చింది. అయినా అలాంటి ఒక సన్నివేశంలో న‌టి పగ్ బేర్ వీపుపై అస్పష్టమైన పాచ్ కనిపించింది.

సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ దానిని బ్లర్ చేయమని డిమాండ్ చేయ‌గా.. చిత్రనిర్మాతలు ఏ స‌ర్టిఫికేష‌న్ కోసం అంగీక‌రించారు. అలాగే as****e అనే పదాన్ని సీబీఎఫ్ సి మ్యూట్ చేయమని అభ్యర్థించింది.

ఆసక్తికరంగా మర్ఫీతో శృంగారంలో మునిగితేలే స‌న్నివేశంలో న‌టి పగ్ భగవద్గీతను చదివే దృశ్యం ఈ చిత్రంలో అలాగే మిగిలిపోయింది. ఆ స‌న్నివేశంపై సెన్సార్ అంత‌గా దృష్టి సారించిన‌ట్టు లేదని ప‌లువురు ఇప్పుడు ప్ర‌శ్నిస్తున్నారు.

మతపరమైన మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉన్న ఆ సన్నివేశాన్ని కత్తిరించకుండా సినిమా విడుదలకు అనుమతించాలన్న CBFC నిర్ణయాన్ని ప‌లువురు ప్ర‌శ్నించారు. ఇది నెటిజన్లలో తీవ్ర‌ చర్చకు దారితీసింది. అయితే ఓపెన్ హైమ‌ర్ సినిమా విడుద‌లై హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పుడు సీబీఎఫ్.సి ఏ చ‌ర్య తీసుకున్నా తీసుకోక‌పోయినా సినిమాకి వ‌చ్చిన న‌ష్ట‌మేమీ లేదనేది నిర్వివాదాంశం.

కై బర్డ్ మరియు దివంగత మార్టిన్ జె. షెర్విన్ రచించిన పులిట్జర్ ప్రైజ్-విజేత జీవిత చరిత్ర పుస్తకం 'అమెరికన్ ప్రోమేతియస్: ది ట్రయంఫ్ అండ్ ట్రాజెడీ ఆఫ్ జె. రాబర్ట్ ఓపెన్‌హైమర్' స్ఫూర్తితో తెర‌కెక్కిన 'ఓపెన్‌హైమర్' 21 జూలై 2023న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రంలో మాట్ డామన్ - ఎమిలీ బ్లంట్- రాబర్ట్ డౌనీ జూనియర్- రామి మాలెక్ - కెన్నెత్ బ్రనాగ్- బెన్నీ సఫ్డీ- డేన్ క్వూరెన్ ఎహైన్ - జాడెన్ - మోడిక్ - జాన్ క్వొయిడెన్ - జాన్త్ మోడిక్- మాట్ డామన్ -జాసన్ క్లార్క్- డేవిడ్ దస్ట్మల్చియాన్ - అలెక్స్ వోల్ఫ్- జేమ్స్ డి ఆర్సీ త‌దిత‌రులు న‌టించారు.