Begin typing your search above and press return to search.

స్టార్ కిడ్స్‌తో ఒర్రీ ఈ ఫ‌న్ ఏంటి గురూ?

ఇప్పుడు అనంత్ అంబానీ తన భార్య రాధిక మర్చంట్ కోసం భారీ పుట్టినరోజు వేడుకను అక్టోబర్ 16న ముంబైలో బాలీవుడ్ ప్రముఖులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు.

By:  Tupaki Desk   |   18 Oct 2024 10:10 AM GMT
స్టార్ కిడ్స్‌తో ఒర్రీ ఈ ఫ‌న్ ఏంటి గురూ?
X

బిలియ‌నీర్ ముఖేష్ అంబానీ త‌న‌యుడు అనంత్ అంబానీ వివాహ వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వంగా సాగిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అనంత్ అంబానీ తన భార్య రాధిక మర్చంట్ కోసం భారీ పుట్టినరోజు వేడుకను అక్టోబర్ 16న ముంబైలో బాలీవుడ్ ప్రముఖులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ గ్రాండ్ సెలబ్రేషన్‌లో అనన్య పాండే, సుహానా ఖాన్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ వంటి తారలు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

అతిథుల‌ జాబితాలో ఆర్యన్ ఖాన్, అర్జున్ కపూర్, రణవీర్ సింగ్, క్రికెట్ లెజెండ్ ఎంఎస్‌ ధోని వంటి ఇతర ప్రముఖులు ఉన్నారు. ఆస‌క్తిక‌రంగా ఈ వేడుక‌లో ఓర్రీ (ఓర్హాన్ అవ్ర‌త‌మ‌ణి) సంద‌డి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. సోషల్ మీడియాల్లో ప్ర‌స్తుతం అత‌డి ఫోటోలు వైర‌ల్ గా మారుతున్నాయి. ఇషా అంబానీ, శ్లోకా అంబానీ సహా ప‌లువురు అతిథులతో అత‌డు దిగిన ఫోటోలు వెబ్‌లోకి వ‌చ్చాయి.

రాధిక తన పుట్టినరోజు కేక్‌ను క‌ట్ చేస్తున్న‌ వీడియోను కూడా ఓర్రీ పోస్ట్ చేశాడు. రాధిక‌ కుటుంబం ఈ వేదిక వ‌ద్ద‌ చుట్టుముట్టింది. ఈ ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ క్లిప్‌లలో 29 ఏళ్ల రాధిక‌ పక్కన అనంత్ అంబానీ టీవిగా క‌నిపించారు. వేదిక‌పై ఎరుపు రంగు పుట్టినరోజు కేక్‌ను ఆనందంగా కత్తిరించారు. ఆ తర్వాత తన భర్త అనంత్ కి, మావగారు అయిన ముఖేష్ అంబానీకి రాధిక‌ కేక్ ముక్కను అందించింది. అంబానీ కుటుంబం కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ, సంబరాలు చేసుకుంటూ కనిపించింది. నీతా అంబానీ బర్త్‌డే మ్యూజిక్ కి డ్యాన్స్ చేస్తూ క‌నిపించ‌గా, ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అతడి భార్య శ్లోకా మెహతా సరదాగా చప్పట్లు కొడుతూ ఆ క్షణాన్ని ఆస్వాధించారు.

అయితే ఈ వేడుక‌లో ఒకే ఒక్క విష‌యం ప్ర‌ధానంగా నెటిజ‌నుల్లో చ‌ర్చ‌గా మారింది. అది ఓర్రీతో స్టార్ కిడ్స్ పోటీప‌డుతూ ఫోటోల‌కు ఫోజులివ్వ‌డం.. అత‌డు అంద‌మైన భామ‌ల‌తో జోవియ‌ల్ గా ఫోటోల‌కు ఫోజులిచ్చాడు. అయితే స్టార్ కిడ్స్ న‌డుముపై సుతారాంగా చెయ్యి వేసి త‌నదైన సిగ్నేచ‌ర్ ఫోజుని ఇవ్వ‌డం ప్రత్యేకంగా ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించింది.