భామలతో `ఓరి` నీ తస్సదియ్యా యవ్వారం
ముఖ్యంగా ఓర్హాన్ గ్రేట్ బిజినెస్ మేన్ ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీతో, సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తోను ఫోటోషూట్ లో పాల్గొనడం విశేషం.
By: Tupaki Desk | 2 Nov 2023 5:50 AM GMTఓర్హాన్ అవత్రమణి అకా ఓర్రీ బాబా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా సూపర్ స్టార్ గా అతడు సుపరిచితుడు. ఓర్హాన్ అవత్రమణి ముంబై వినోద పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, పేరు తెచ్చుకున్నాడు. అతడు తరచుగా పరిశ్రమ సమావేశాలు- సెలబ్రిటీలతో కలిసి పార్టీలలో కనిపిస్తాడు. అతడి చుట్టూ ఎప్పుడూ గాళ్స్ గ్యాంగ్ ఉంటుంది. అతడు తాను హాజరయ్యే ఈవెంట్‌ల నుండి ఫోటోలను తన స్నేహితులతో షేర్ చేస్తుంటాడు. అవన్నీ ఇంటర్నెట్ లో తుఫాన్ వేగంతో దూసుకుపోతుంటాయి. నవరాత్రి వేడుకల వేళ ఇటీవలి వేడుక నుండి ఫోటోలను అతడు సోషల్ మీడియాల్లో షేర్ చేసాడు.
ఓర్రీతో పాటు ఈ వేడుకల్లో గాళ్స్ గ్యాంగ్ బోలెడంత సందడి చేసారు. ముఖ్యంగా ఓర్హాన్ గ్రేట్ బిజినెస్ మేన్ ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీతో, సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తోను ఫోటోషూట్ లో పాల్గొనడం విశేషం. అతడు రెడ్ ఎల్లో బ్రౌన్ మిశ్రమ రంగు బ్లేజర్ - మిక్స్ డ్ కలర్స్ డెనిమ్ ప్యాంటు ధరించి స్టైలిష్ గా కనిపించాడు. అతడు దీపిక పదుకొనే, సుహానా ఖాన్, సారా అలీ ఖాన్, అలయా ఎఫ్, రాషా తడానీ, భూమి పెడ్నేకర్ సహా బాలీవుడ్ కు చెందిన అనేక మంది ఎ-లిస్టర్ ప్రముఖులతో ఫోటోలకు పోజులిచ్చాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
అతని ఫోటో డంప్ నుండి వచ్చిన ఫోటోలకు నెటిజన్లు గొప్పగా స్పందించారు. స్టార్‌లపై తమ అభిమానాన్ని వ్యక్తీకరించడానికి అభిమానులు హార్ట్ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఇంటర్నెట్‌లోని ఒక విభాగం అతడి గురించి అసహ్యకరమైన కామెంట్లు చేయడం కనిపించింది. ``లడ్కే కే బ్యాక్ ఎమ్ ప్రాబ్లమ్ హెచ్ షాయ్ద్`` అని ఒకరు రాశారు. మరొకరు, ```షారూఖ్ కి బేటీ హై మ్హాసల్లా`` అని రాశారు. మరొకరు ``సార టెండూల్కర్ కో భీ న్హీ చోడా ఇస్నే`` అని రాశారు. ఒక నెటిజన్ ఇలా వ్యాఖ్యానించాడు. ``ప్రతి అమ్మాయితోను రాసుకుపూసుకుని తిరుగుతున్నాడు.. కేవలం సుహానా మాత్రమే ఈ ఫోటోలలో దూరంగా ఉంది`` అని రాసాడు. అతడిని చూస్తే బాల్‌ని గురి చూసి తోసే క్యూలాగా ఉన్నాడు అంటూ ఒక అభిమాని తన కుళ్లును ప్రదర్శించాడు.
అయితే మిస్టర్ ఒర్రీ ఇలా సెలబ్రిటీ కిడ్స్ తో పార్టీలు చేసుకోవడం ఇదే మొదటి సారి కాదు. అతడి ఇన్ స్టా షూట్లు పరిశీలిస్తే చాలు. అందులో పరిశ్రమ స్టార్ హీరోయిన్లు, స్టార్ కిడ్స్ సహా ముంబైలోని ప్రముఖులంతా ప్రత్యక్షమవుతుంటారు. అంతగా అతడు ఫ్యాషన్ ప్రపంచంలో పాపులరయ్యాడు. తన వృత్తి గురించి ఇంతకు ముందు అడిగినప్పుడు ఓర్రీ ఏమన్నారంటే...? తాను గాయకుడు, పాటల రచయిత, ఫ్యాషన్ డిజైనర్, సృజనాత్మక దర్శకుడు, ఫ్యాషన్ స్టైలిస్ట్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అని చాలా చిట్టా చెప్పాడు. మంచి షాపర్, కొనుగోలుదారు, ఫుట్‌బాల్ ప్లేయర్, ఆర్ట్ క్యూరేటర్ అని కూడా వెల్లడించాడు. అతని అధికారిక లింక్డ్ఇన్ ప్రొఫైల్ బయో ప్రకారం.. అతడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో ప్రత్యేక ప్రాజెక్ట్ మేనేజర్. అతడు రాధికా మర్చంట్ -ఇషా అంబానీతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు.