Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్- స‌మంత‌ల‌కే ఈ స‌ర్వే ప‌ట్టం ఎందుకు?

వారిలోంచి బెస్ట్ ఎవ‌రో క‌నిపెట్ట‌డ‌మెలా? అలాంటి స‌ర్వేలు చేయ‌డంలో ఓర్మాక్స్ మీడియాకు పేరుంది.

By:  Tupaki Desk   |   21 Nov 2024 1:30 PM GMT
ప్ర‌భాస్- స‌మంత‌ల‌కే ఈ స‌ర్వే ప‌ట్టం ఎందుకు?
X

స్టార్ డ‌మ్‌కి ప్రాతిప‌దిక ఏది? థియేట‌ర్ల‌లో ఆద‌ర‌ణ‌.. స‌క్సెస్ రేటు.. ఛామ్ అండ్ ఛ‌రిష్మా .. సోష‌ల్ మీడియాల్లో ఫాలోయింగ్.. గూగుల్ సెర్చ్.. ఇంకా ఏవైనా కార‌ణాలు కావొచ్చు. నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో న‌లుగుతున్న చాలా మంది అగ్ర తార‌లు ఉన్నారు. వారిలోంచి బెస్ట్ ఎవ‌రో క‌నిపెట్ట‌డ‌మెలా? అలాంటి స‌ర్వేలు చేయ‌డంలో ఓర్మాక్స్ మీడియాకు పేరుంది.

పాపుల‌ర్ మీడియా రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ సంస్థ ఓర్మాక్స్ మీడియా ప్ర‌తినెలా మారుతున్న స్టార్ ప‌వ‌ర్ గురించి స‌ర్వే చేస్తోంది. ఎప్ప‌టిలాగే ఇప్పుడు అక్టోబర్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సినీ తారల రేటింగ్‌లను ప్రకటించింది. రెబల్ స్టార్ ప్రభాస్ .. సమంతల‌ను టాప్ హీరో .. టాప్ హీరోయిన్ అని ప్ర‌క‌టించింది.

రెబల్‌స్టార్ ప్రభాస్ అసాధార‌ణ ఛ‌రిష్మా.. నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలిచే సామ‌ర్థ్యం.. క‌ల్కి 2898 ఏడి అసాధార‌ణ విజయం నేప‌థ్యంలో అత‌డు చార్టులలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడ‌ని స‌ర్వే నివేదించింది. భారతీయ చలనచిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత డిమాండ్ ఉన్న స్టార్‌లలో ప్ర‌భాస్ ఒకడు. స‌లార్ 2 , క‌ల్కి 2, రాజా సాబ్, స్పిరిట్ లాంటి భారీ ప్రాజెక్టుల్లో న‌టిస్తున్నందున అత‌డి పేరు నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లు విస్తృతంగా హైప్‌ని పొందాయి.

క‌థానాయిక‌ల్లో స‌మంత‌కే ప‌ట్టంగ‌ట్టింది ఓర్మాక్స్. సిటాడెల్ -హనీ బన్నీ లో అద్భుత న‌ట‌న‌తో స‌మంత‌ హృదయాలను గెలుచుకుంది. సామ్ న‌ట‌న‌, అంకితభావం త‌న స్థాయిని నిల‌బెట్టాయి. మొదటి ఐదు స్థానాల్లో ప్రభాస్ తర్వాతి స్థానాల్లో ద‌ళ‌ప‌తి విజయ్, కింగ్ ఖాన్ షారుక్ , యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, త‌ళా అజిత్ కుమార్ ఉన్నారు. ఇతరులలో అల్లు అర్జున్, మహేష్ బాబు, సూర్య, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ టాప్ టెన్ లో ఉన్నారు.

క‌థానాయిక‌ల్లో స‌మంత త‌ర్వాతి స్థానంలో అలియా భట్, నయనతార, దీపికా పదుకొనే, త్రిష వ‌రుస‌గా ఐదు స్థానాలను కైవసం చేసుకున్నారు. కాజల్ అగర్వాల్, శ్రద్ధా కపూర్, సాయి పల్లవి, రష్మిక, కత్రినా కైఫ్ టాప్ టెన్ లో నిలిచారు. ఈ ర్యాంకులు ప్ర‌తి నెలా మారుతూనే ఉంటాయి. స్టార్లు త‌మ ప్రాజెక్టుల‌తో ఏం చేసార‌న్న‌ది ఇందులో ప్ర‌తిబింబిస్తుంది.