తప్ప తాగి దొరికిన ఒర్రీ లగ్జరీ హోటల్ బిల్లులు షాకింగ్!
ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి పవిత్ర దేవాలయం వైష్ణో దేవి ఆలయ పరిసరాల్లో మద్యం సేవించాడనే ఆరోపణలపై ఎఫ్.ఐ.ఆర్ నమోదైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 March 2025 9:01 AM ISTఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి పవిత్ర దేవాలయం వైష్ణో దేవి ఆలయ పరిసరాల్లో మద్యం సేవించాడనే ఆరోపణలపై ఎఫ్.ఐ.ఆర్ నమోదైన సంగతి తెలిసిందే. మద్యం, మాంసాహారం నిషేధించిన స్థలంలో అతడు ఈ పనికి పాల్పడడంతో జమ్ము అండ్ కశ్మీర్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓర్రీ సహా ఒక రష్యన్ యువతిని, మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కథనాలొచ్చాయి.
అయితే ఆ సమయంలో ఓర్రీ ఎక్కడ బస చేశాడు? ఎంత ఖర్చు చేసాడు? అన్నదానిని పోలీసులు ఆరాలు తీసారు. జాతీయ మీడియా కథనం ప్రకారం... ఓర్రీ బస చేసిన హోటల్ ప్రఖ్యాత `మారియట్ రిసార్ట్ అండ్ స్పా` అని తెలుస్తోంది. కాటేజీలు వైష్ణో దేవి మందిరం వీక్షణతో కాట్రాలోని దట్టమైన పైన్ అడవిలో ఉన్నాయి.
కాట్రా మారియట్ రిసార్ట్ & స్పా గుబులు పుట్టించే పర్వత వీక్షణతో మతి చెడగొడుతుంది. 100 గదులు.. 80 సూట్ గదులతో అందమైన ప్రకృతి దశ్యాల ప్రత్యక్ష వీక్షణలతో ఆకర్షిస్తుంది. జమ్మూ విమానాశ్రయం నుండి దాదాపు ఒక గంట ప్రయాణ దూరంలో మారియట్ ఇటీవలే కొత్తగా ప్రారంభమైంది. ఈ లగ్జరీ హోటల్ కూడా వెల్కమ్ హోటల్ కాట్రా, వివాంత కాట్రా వంటి హై ఎండ్ హోటళ్ల వరుసలో కొలువు దీరి ఉంది. ఈ రిసార్ట్‌లో కాటేజ్ గదులు, సూట్‌లు, రెండు బాల్‌రూమ్‌లు, ఒక వ్యూయింగ్ డెక్, ఒక స్పా, ఒక అవుట్‌డోర్ పూల్, 24/7 జిమ్ ఉన్నాయి.
కాట్రా మారియట్ రిసార్ట్ & స్పా అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం.. ఒక రాత్రి బసకు అతిథి గదుల ధర రూ.6,650, రూ.8,000 మధ్య ఉంటుంది. అయితే కాటేజీల అద్దె ఒక రాత్రికి రూ.8,740 నుండి రూ.31,000 వరకు ఉంటాయి. అదనపు సౌకర్యాలు, పన్నుల ఆధారంగా ధరలు మారుతూ ఉంటాయి. ఓర్రీ బృందం వీటిలో అత్యంత ఖరీదైన కాటేజీలను బుక్ చేసుకున్నారు. ఒక రాత్రి కోసం వారి ఖర్చు సుమారు 50,000 పైబడి ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. 10 రోజులు బస చేస్తే సుమారు 5 లక్షలు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.