లేడీ గ్యాంగ్ మధ్యలో ఒర్రీ కిల్ మిలింగే!
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ హల్దీ వేడుక గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 July 2024 10:33 AM GMTఅనంత్ అంబానీ-రాధికా మర్చంట్ హల్దీ వేడుక గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో ఖుషీ కపూర్, అనన్య పాండే, శానయ్య కపూర్ సహా పలువురు యంగ్ బ్యూటీలంతా పాల్గొన్నారు. అంతా ముఖానికి పసపు దుస్తులు ధరించి..ముఖానికి పసుపు పూసుకుని ఎంచక్కా సందడి చేసారు. ఆ ప్రెండ్స్ గ్యాంగ్ లో ఒర్రీ సైతం చేరిపోయాడు. నేను కూడా మీతో అంటూ పచ్చ బట్టలేసుకుని పసుపు రాసుకుని దూరి పోయాడు.
వాళ్ల భుజాల మీద ఒర్రీ....అతని భుజాల మీద అందమైన భామలు చేతులు వేసుకుని ఫోటోలు దిగారు. ఆ గుంపులో అందరి నవ్వు ఒక ఎత్తైతే...ఒర్రీ స్మైల్ పెంట్రాఫ్ ది అట్రాక్షన్ గా నిలిచింది. ఎన్ని అందాలున్నా ఒర్రీ ఒక్క స్మైల్ తో అటెన్షన్ డ్రా చేసాడు. తాజాగా ఆ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు ఇన్ స్టాలో వైరల్ అవుతున్నాయి. అందమైన అమ్మాయిల మధ్యలో ఒర్రీ అంటూ అతడి ఫ్యాన్స్ నెట్టింట రచ్చ చేస్తున్నారు.
బాలీవుడ్ లో ఓర్రీ అలియాస్ అవత్రమని ఎంత ఫేమస్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. నటుడు కాకపోయినా బాలీవుడ్ సెలబ్రిటీలందరితోనూ మంచి పరిచయాలున్నాయి. అందులోనూ యువ హీరోయిన్లలో ఒర్రీ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఒర్రీ లేకుండా పార్టీనే సెలబ్రేట్ చేసుకోరు. సెలబ్రిటీల నైట్ పార్టీల్లో ఒర్రీ ఓ గెస్ట్ లాంటివాడు. అలా వెలుగులోకి వచ్చిన వాడే ఒర్రీ. కుర్ర భామలందిరికీ ఓ బెస్ట్ గా మారిపోయాడు.
ఒర్రీ కింద ఇప్పుడు ఐదారుగురు మేనేజర్లు కూడా ఉన్నాడు. ఇన్ స్టాతో అంతటి పాపులారిటీ దక్కింది. లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ఒర్రీ ఆదాయం కూడా భారీగానే ఉంది. సెలబ్రిటీ క్రేజ్ ని తెలివిగా వినియోగించుకుని కెరీర్ లో ముందుకెళ్తున్నాడు. కానీ ఇంకా సినిమాలకు ప్రమోట్ కాలేదు. అందుకు ఎంతో సమయం పట్టకపోవచ్చు.