Begin typing your search above and press return to search.

ఓర్రీ సెల్ఫీల ఆదాయం షాకిస్తోందే

అందుకే ఇప్పుడు అత‌డు కేవ‌లం స్టార్ కిడ్స్ తో లేదా స్టార్ల‌తో మాత్ర‌మే స్నేహంలో ఉన్నాడని అర్థ‌మైంది.

By:  Tupaki Desk   |   27 Nov 2023 4:29 AM GMT
ఓర్రీ సెల్ఫీల ఆదాయం షాకిస్తోందే
X

ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్ర‌త‌మ‌ణి ఎవ‌రు? అంటూ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో బిగ్ డిబేట్ నడిచింది. దీనికి స‌మాధానం కూడా వ‌చ్చింది. అత‌డు రిల‌య‌న్స్ సంస్థ‌ల్లో ఒక ఉద్యోగి అని కూడా అంతా తెలుసుకున్నారు. అంతేకాదు స్టార్ కిడ్స్ తో పాటు అంబానీ స్కూల్ లో అత‌డు విద్యాభ్యాసం సాగించాడు. అత‌డికి సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో గొప్ప ప‌రిచ‌యాలున్నాయి. అందుకే ఇప్పుడు అత‌డు కేవ‌లం స్టార్ కిడ్స్ తో లేదా స్టార్ల‌తో మాత్ర‌మే స్నేహంలో ఉన్నాడని అర్థ‌మైంది.

పార్టీ క్రౌడ్ నుంచి ఓర్రీకి బోలెడంత అండ‌దండలు ఉన్నాయి. కార‌ణం ఏదైనా అత‌డి క్రేజ్ ఇప్పుడు అత‌డికి అవ‌కాశాలు తెచ్చి పెడుతోంది. అత‌డు ఏకంగా బిగ్ బాస్ ఇంటిలోప‌లికి అడుగుపెట్టాడు. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా బిగ్ బాస్ 17 హౌస్ ర‌క్తి క‌ట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ ఇంటిలోకి ఓర్రీని వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా స‌ల్మాన్ పరిచయం చేశాడు. ఐ యామ్ లివ‌ర్ పేరుతో ఉన్న ఒక టీష‌ర్ట్ ని ధ‌రించి అత‌డు స‌ల్మాన్ భాయ్ తో పాటు క‌నిపించాడు. అయితే ఈ టీష‌ర్ట్ ఎంపిక గురించి సల్మాన్ సరదాగా ఓర్రీని ప్రశ్నించాడు. ఓర్రీ దీనికి స్పందిస్తూ ``అవును, ఐ యామ్ లివ‌ర్... భాయ్ నటించారు.. లతా మంగేష్కర్ పాడారు.. నేను ఇలా జీవిస్తున్నాను - నేను ఒక కాలేయం`` అని అన్నాడు.

భాయ్ తో చాటింగ్ లో ఇంకా చాలా విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఓర్రీ తన సంపాదన వెనుక ఉన్న రహస్యాన్ని కూడా బయటపెట్టాడు. అత‌డు ఒక్కో ఈవెంట్ ఫోటోల కోసం రూ. 20-30 లక్షల వరకు పారితోషికం పొందుతున్నట్లు వెల్లడించడంతో అంతా షాక‌య్యారు. ఆస‌క్తిక‌రంగా త‌న స్ప‌ర్శ చాలా మంది ఆరోగ్యానికి మంచిద‌ని అత‌డు జోక్ చేసాడు.