Begin typing your search above and press return to search.

వీడియో: ఓర్రి! కైలీ జెన్న‌ర్‌తోనే ప‌రాచికాలు!!

కానీ వీళ్లెవ‌రికీ లేనంత ఫాలోయింగ్ ని ఓర్రి ఎలా తెచ్చుకున్నాడు? అంటూ ప్ర‌శ్నించే వారు ఉన్నారు.

By:  Tupaki Desk   |   12 Aug 2024 12:30 AM GMT
వీడియో: ఓర్రి! కైలీ జెన్న‌ర్‌తోనే ప‌రాచికాలు!!
X

బాలీవుడ్ నైట్ పార్టీల్లో అత‌డు ఒక టెంప్టేష‌న్ వేవ్! పార్టీల్లో యువ‌హీరోయిన్ల‌తో అతడి స‌ర‌దాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్ప‌టికే నెట్ ని ముంచెత్తాయి. ఓర్రి ఫాలోయింగ్ చూసి చాలామంది కుళ్లుకున్నారు. ప‌రిశ్ర‌మ‌లో ఎంద‌రో యువ‌హీరోలు, స్టార్లు ఉన్నారు. కానీ వీళ్లెవ‌రికీ లేనంత ఫాలోయింగ్ ని ఓర్రి ఎలా తెచ్చుకున్నాడు? అంటూ ప్ర‌శ్నించే వారు ఉన్నారు. కానీ అది ఓర్రీకే సాధ్య‌మైన విద్య‌.

ఇండ‌స్ట్రీ హాట్ గాళ్స్ జాన్వీ, ఖుషి, సారా, అన‌న్య నుంచి సీనియ‌ర్ న‌టీమ‌ణులు క‌త్రిన‌, క‌రీనా, దీపిక‌, భూమి ఇలా అంద‌రూ అత‌డిని అభిమానిస్తారు. ఓర్రీ లేనిదే అస‌లు పార్టీయే లేదు. ముంబై నైట్ లైఫ్‌లో అతడు క‌న్ఫామ్‌గా ఉండాల్సిందే. ఇప్పుడు ఇదే జాబితాలో అంత‌ర్జాతీయ న‌టి కైలీ జెన్న‌ర్ కూడా చేరారు. ఓర్రీతో కైలీ జెన్న‌ర్ సెల్ఫీ వీడియో ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.

నిజానికి 2017లో తీసిన సెల్ఫీ ఇది. ఓర్రీ ఇండియన్ సెలెబ్ సర్క్యూట్‌లో తగినంతగా పేరు పొందని రోజుల్లోనే అతడు కైలీ జెన్నర్‌తో సెల్ఫీ దిగాడు. ఇప్పుడు దానిని షేర్ చేసి `రీయూనైటెడ్` అని రాశాడు. అంతకుముందు 2015లో అతడు కెండల్ జెన్నర్‌తో కలిసి ఉన్న మ‌రో ఫోటోని కూడా పోస్ట్ చేశాడు.

ఆస‌క్తిక‌రంగా కైలీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా.. ఎన్టీఆర్ -జాన్వీ కపూర్‌ల దేవరలోని చుట్ట‌మల్లె (ధీరే ధీరే -హిందీ) పాటతో శుభాకాంక్షలు తెలిపాడు. దీనిపై కైలీ స్వ‌యంగా వ్యాఖ్యల విభాగంలో స్పందించారు. దేవరలో తంగం పాత్రను పోషిస్తున్న జాన్వీ కపూర్ ఈ వీడియోపై స్పందిస్తూ ``నా నా పూలూ`` అని వ్యాఖ్యానించింది.