Begin typing your search above and press return to search.

ఓర్రీ హిజ్రానా? తీవ్రంగా హ‌ర్ట‌య్యాడుగా!

ఇటీవల తనను 'ట్రాన్స్' అని 'ఇడియట్' అని నెటిజ‌నులు కామెంట్ చేసినందుకు అత‌డు చాలా ఫీల‌య్యాడు. ఓర్రీ ట్రోల‌ర్ల‌కు తన సుదీర్ఘమైన సమాధానంతో సోష‌ల్ మీడియాల్లో స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసాడు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 11:53 AM GMT
ఓర్రీ హిజ్రానా? తీవ్రంగా హ‌ర్ట‌య్యాడుగా!
X

అత‌డు అమ్మాయిల‌కు మాత్ర‌మే కాదు అబ్బాయిల‌కు చెలికాడు! అందుకే అత‌డు హిజ్రా (ట్రాన్స్ జెండ‌ర్)! అంటూ నెటిజ‌నుల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి ట్రోల‌ర్ల‌కు స‌మాధాన‌మివ్వ‌లేక అత‌డు తీవ్రంగా స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఈ ప‌రిస్థితి అవ‌మాన‌క‌ర‌మైన‌ది. అందుకే అత‌డు విరుచుకుప‌డ్డాడు. ఇంత‌కీ ఎవ‌రు అత‌డు? అంటే మ‌గువ‌ల గుండెల్లో మారాజుగా పాపుల‌రైన 'స్టార్ కిడ్ ఫ్రెండు' ఓర్రీ గురించే ఇదంతా.

ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్ర‌త‌మ‌ణి.. చాలా వేగంగా సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో పాపుల‌రైన పేరు. అత‌డు త‌న‌దైన శైలి, ఫ్యాష‌న్ సెన్స్, స్నేహాల‌తో బాగా పాపుల‌ర‌య్యాడు. నిరంత‌రం స్టార్ కిడ్స్ తో క‌లిసి పార్టీలు చేసుకుంటూ హుషారుగా క‌నిపించ‌డంతో అత‌డికి ద‌క్కిన ఈ స్నేహానికి యువ‌త‌రం కుళ్లుకుపోయింది. స్టార్ కిడ్స్ లో శ్రీ‌దేవి కుమార్తెలు జాన్వీ-ఖుషీల‌కు, షారూఖ్ కుమార్తె సుహానాకు, అజ‌య్ దేవ‌గ‌న్ - కాజోల్ జంట కుమార్తె నైసా దేవ‌గ‌న్ కు, సంజ‌య్ క‌పూర్ కుమార్తె సాన‌యాకు, చుంకీ పాండే కుమార్తె అన‌న్య పాండేకు కూడా అత‌డు స‌న్నిహితుడు. వీళ్ల‌తో నిరంత‌రం పార్టీలు చేసుకుంటూ ఎదుటివారిలో కంప‌రం పుట్టిస్తున్నాడు.

ఇటీవల తనను 'ట్రాన్స్' అని 'ఇడియట్' అని నెటిజ‌నులు కామెంట్ చేసినందుకు అత‌డు చాలా ఫీల‌య్యాడు. ఓర్రీ ట్రోల‌ర్ల‌కు తన సుదీర్ఘమైన సమాధానంతో సోష‌ల్ మీడియాల్లో స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసాడు. ఇంత‌కీ నెటిజ‌నులు ఓర్రీపై ఏమ‌ని కామెంట్ చేసారు? అంటే .. అత‌డి సోష‌ల్ మీడియా పోస్టులు చూస్తుంటే ఏ పేజీకి వెళ్లినా 'ట్రాన్స్ వాకింగ్' లేదా 'ఒకరిని చేతుల‌తో లాల‌న‌గా కొట్టడం' లేదా ప్రతిచోటా ట్రాన్స్ లాగా పోజులివ్వడం చూస్తున్నాం.. సోషల్ మీడియాలో ఈ ఇడియట్‌ను ఎవరూ ఎందుకు నిషేధించరు? అని ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానించాడు. అయితే ఓర్రీ ట్రోల్‌ను పట్టించుకోని మూడ్‌లో లేను అంటూనే.. కానీ ఉన్నాడు!! చివ‌రికి అత‌డు 'విషపూరిత వ్యక్తులు .. పూర్తిగా అసహ్యకరమైనవారు! అంటూ త‌న‌ను ట్రోల్ చేసిన వ్య‌క్తిపై చిర్రుబుర్రులాడాడు.

ఇలా మాట్లాడటం స‌రికాదు. ఇలా అగౌరవం కలిగించే విధంగా మాట్లాడటం వలన మీ త‌ల్లిదండ్రుల‌కు ఒక ప్ర‌శ్న ఎదుర‌వుతుంది. బిడ్డను ఎలా పెంచాలో వారికి తెలియదని మీ డిపిని చూపిస్తారు. డిపిలో మీరు ఒక మధురమైన అమాయకపు అమ్మాయిలా ఫోజులిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరూ తెలుసుకోలేరని మీరు భావించి మీ వ్యాఖ్యలను బ‌ట్టి మీలోని పాము & విషాన్ని గ‌మ‌నించాను. మీ తల్లిదండ్రులకు మీతో పరిచయం ఉన్న ఎవరికైనా మీ ప్ర‌వ‌ర్త‌న‌ అవమానక‌రం. నేను నేనే .. మనిషిని, కానీ మీ తెలివితక్కువ వ్యాఖ్యలు, మొత్తం సమాజాన్ని అణచివేయడానికి మీరు ఉపయోగిస్తున్న స్వరం పూర్తిగా అసహ్యంగా ఉంది! అంటూ ఓర్రీ సీరియ‌స్ అయ్యాడు.

సిగ్గుపడాలి, మీలాంటి మురికి మనసులు ఉన్నవారి వల్ల మానవత్వంపై నమ్మకం పోతుంది. మీరు మీ వ్య‌క్తిగ‌త జీవితంలో చాలా విచారంగా దయనీయంగా ఉంటారు. మీరు ఇంటర్నెట్‌లో కూర్చుని అలాంటి విషాన్ని వాంతి చేసుకుంటారు. ఒక విషపూరితమైన వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిపైనా విషం చిమ్ముతున్నాడని అర్థం చేసుకోవాలి.. మీ జీవితంలో మీకు స్నేహితులు లేదా ప్రేమ ఉండకపోవచ్చు... అని కూడా ట్రోల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. నేను ఇలా చేయడంలో తప్పేనా? అని కూడా ఓర్రీ ప్ర‌శ్నించాడు. ఓర్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అతడు నిరంత‌రం తన ఫోటోలు వీడియోలను షేర్ చేస్తుంటాడు. ప్రతి బాలీవుడ్ పార్టీలో కనిపించిన తర్వాత హెడ్ లైన్స్ లోకొస్తున్నాడు. భారతదేశంలోని అత్యంత ధనిక వంశం అయిన అంబానీలతోను అత‌డు స్నేహాన్ని క‌లిగి ఉన్నాడు. ఇటీవ‌ల‌ సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 17 లో కంటెస్టెంట్‌గా ప్రవేశించ‌నున్నాడ‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే ఇంకా ఇది ఖ‌రారు కాలేదు నవంబర్ 23న ఓర్రీ బిగ్ బాస్ హోస్ట్ స‌ల్మాన్ తో క‌లిసి ఉన్న‌ ఒక ఫోటోని షేర్ చేసాడు. రియాలిటీ షో సెట్స్‌లో తన ఉనికిని ధృవీకరించాడు. అవ్ర‌త‌మ‌ణి బిగ్ బాస్ ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నాడ‌న్న ప్ర‌చారం ఇప్ప‌టికే వైర‌ల్ అయింది.