Begin typing your search above and press return to search.

ఆస్కార్‌ అవార్డ్స్‌ -2025 విజేత‌ల జాబితా

ప్ర‌తిష్ఠాత్మ‌క ఆస్కార్స్- 2025 పుర‌స్కారాల్లో అనోరాకు అవార్డుల పంట పండిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 March 2025 12:26 PM IST
ఆస్కార్‌ అవార్డ్స్‌ -2025 విజేత‌ల జాబితా
X

ప్ర‌తిష్ఠాత్మ‌క ఆస్కార్స్- 2025 పుర‌స్కారాల్లో అనోరాకు అవార్డుల పంట పండిన సంగ‌తి తెలిసిందే. లాస్‌ ఏంజెలెస్‌ డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగిన 97వ అకాడెమీ అవార్డుల వేడుకలో `అనోరా` ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌ విభాగాల్లో అవార్డులను కైవ‌సం చేసుకుంది. ది బ్రూటలిస్ట్ లో నటనకు గానూ ఉత్తమ నటుడిగా అడ్రియన్‌ బ్రాడీ.. అనోరాలో నటనకు మైకీ మ్యాడిసన్‌ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. అనోరాకు సీన్‌ బేకర్‌ ఉత్తమ దర్శకుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. ఎల్ మాల్- ఉత్త‌మ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో విజేత‌గా నిలిచింది. డ్యూన్‌: పార్ట్‌2 ఉత్తమ సౌండ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. ఈ వేడుక‌కు హాలీవుడ్ ప్ర‌ముఖ తార‌ల‌తో పాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.

ఈ వేదిక వ‌ద్ద ప‌లువురు న‌టీమ‌ణులు అంద‌మైన దుస్తుల్లో హొయ‌లు పోతూ మైమ‌రిపించారు. అలాగే వేదిక‌పై లిప్ లాక్ లు గ్లామ‌ర్ షోలు అహూతుల‌ను ఆక‌ర్షించాయి. ఎమిలియా ఫెరెజ్ చిత్రానికి గాను జో సల్ధానా ఉత్త‌మ స‌హాయ‌న‌టి పుర‌స్కారాన్ని అందుకుంటూ వేదిక‌పై ఎమోష‌న‌ల్ అయ్యారు. ప్రస్తుతం ఆస్కార్ వేదిక నుంచి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఆస్కార్‌ విజేతల జాబితా:

ఉత్తమ చిత్రం - అనోరా

ఉత్తమ నటుడు - అడ్రియన్‌ బ్రాడీ (ది బ్రూటలిస్ట్‌)

ఉత్తమ నటి - మైకీ మ్యాడిసన్‌ (అనోరా)

ఉత్తమ దర్శకత్వం - అనోరా (సీన్‌ బేకర్‌)

ఉత్తమ సహాయ నటుడు - కీరన్‌ కైల్‌ కల్కిన్‌ (ది రియల్‌ పెయిన్‌)

ఉత్తమ సహాయ నటి - జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)

ఉత్తమ స్క్రీన్‌ప్లే - అనోరా (సీన్‌ బేకర్‌)

ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే - కాన్‌క్లేవ్‌ (పీటర్‌ స్ట్రాగన్‌)

ఉత్తమ ఎడిటింగ్ - అనోరా (సీన్‌ బేకర్‌)

ఉత్తమ సినిమాటోగ్రఫీ - ది బ్రూటలిస్ట్‌ (లాల్‌ క్రాలే)

ఉత్తమ సౌండ్‌ - డ్యూన్‌: పార్ట్‌2

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ - డ్యూన్‌:పార్ట్‌2

ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ - ఎల్‌ మాల్‌ (ఎమిలియా పెరెజ్‌)

అంత‌ర్జాతీయ ఫీచ‌ర్ ఫిల్మ్‌ - ఐయామ్‌ స్టిల్‌ హియర్‌ (వాల్టర్‌ సాల్లెస్‌- బ్రెజిల్‌)

ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ - ది బ్రూటలిస్ట్‌ (డానియల్‌ బ్లమ్‌బెర్గ్‌)

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ - వికెడ్‌

ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ - ఐయామ్‌ నాట్‌ ఏ రోబో

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌- ది ఓన్లీ గర్ల్ ఇన్‌ ది ఆర్కెస్ట్రా

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ - నో అదర్‌ ల్యాండ్‌

ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ఫిల్మ్‌ - ఇన్‌ ది షాడో ఆఫ్‌ ది సైప్రెస్‌

ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ - ఫ్లో

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌ - వికెడ్‌ (పాల్‌ తేజ్‌వెల్‌)

ఉత్తమ మేకప్‌, హెయిల్‌స్టైల్‌ - ది సబ్‌స్టాన్స్‌