ఆస్కార్ బరిలో నెట్టి నిలిచేది ఎవరు?
సినీ ప్రపంచమంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తోన్న ఆస్కార్ అవార్డుల సంబరానికి రంగం సిద్దమైంది.
By: Tupaki Desk | 24 Jan 2024 8:51 AM GMTసినీ ప్రపంచమంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తోన్న ఆస్కార్ అవార్డుల సంబరానికి రంగం సిద్దమైంది. భారత్ కాలమాన ప్రకారం మంగళవారం రాత్రి 96వ అకాడమీ అవార్డుల నామినేషన్లు ప్రకటించారు. ఉత్తమ చిత్రం..ఉత్తమ నటుడు..ఉత్తమ నటి..ఉత్తమ విదేశీ చిత్రం..ఉత్తమ విదేశీ దర్శకుడు ఇలా 23 విభాగాల్లో 120కి పైగా చిత్రాలు..డాక్యుమెంటరీకి సంబంధించిన నామినేషన్లు ప్రకటించారు.
ఉత్తమ చిత్రం విభాగం నుంచి `అమెరికన్ ఫిక్షన్`.. `అనాటమీ ఆఫ్ ఎ ఫాల్`.. `బార్బీ`.. `ది హోల్డోవర్స్`..`కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్` ..`మాస్ట్రో.. `ఓపెన్‌హైమర్`.. పాస్ట్ లివ్స్..పూర్ థింగ్స్..`ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్` నామినేట్ అయ్యాయి. ఉత్తమ నటుడిగా ఉత్తమ నటుడు బ్రాడ్లీ కూపర్ (మ్యాస్ట్రో).. కోల్మన్ డొమింగో (రస్టిన్).. పాల్ గియామట్టి (ది హోల్డోవర్స్).. సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్).. జెఫ్రీ రైట్ (అమెరికన్ ఫిక్షన్) నామినేట్ అయ్యారు. ఇక ఉత్త మ నటి విభాగంలో అన్నెట్ బెనింగ్ (న్యాద్).. లిల్లీ గ్లాడ్‌స్టోన్ (కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్).. సాండ్రా హుల్లర్ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్).. కారీ ముల్లిగాన్ (మాస్ట్రో).. ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)గాను నామినేట్ అయ్యారు.
ఉత్తమ సహాయన నటి విభాగం నుంచి ఉత్తమ సహాయ నటి ఎమిలీ బ్లంట్ (ఓపెన్‌హైమర్).. డేనియల్ బ్రూక్స్ (ది కలర్ పర్పుల్).. అమెరికా ఫెర్రెరా (బార్బీ).. జోడీ ఫోస్టర్ (న్యాద్) డావిన్ జాయ్ రాండోల్ఫ్ (ది హోల్డోవర్స్) పోటీ పడుతున్నారు. ఉత్తమ సహాయ నటుడు విభాగంలో.. టెర్లింగ్ కె. బ్రౌన్ (అమెరికన్ ఫిక్షన్).. రాబర్ట్ డి నీరో (కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్).. రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్).. ర్యాన్ గోస్లింగ్ (బార్బీ) ..మార్క్ రుఫెలో (పూర్ థింగ్స్)బరిలో ఉన్నారు. ఉత్తమ దర్శకుడు విభాగంలో ఉత్తమ దర్శకుడు జస్టిన్ ట్రైట్ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్).. మార్టిన్ స్కోర్సెస్ (కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్).. క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్).. యోర్గోస్ లాంటిమోస్ (పూర్ థింగ్స్).. జోనాథన్ గ్లేజర్ (ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్) పోటీ పడుతున్నారు.
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం లో అయో కాపిటానో (ఇటలీ)..పర్ఫెక్ట్ డేస్ (జపాన్).. సొసైటీ ఆఫ్ ది స్నో (స్పెయిన్).. ది టీచర్స్ లాంజ్ (జర్మనీ).. ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (యునైటెడ్ కింగ్‌డమ్) చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ (జస్టిన్ ట్రియెట్ మరియు ఆర్థర్ హరారి).. ది హోల్డోవర్స్ (డేవిడ్ హెమింగ్సన్)..మాస్ట్రో (బ్రాడ్లీ కూపర్ మరియు జోష్ సింగర్)..మే డిసెంబర్ (సామీ బుర్చ్ అండ్ అలెక్స్ మెకానిక్).. పాస్ట్ లైవ్స్ (సెలిన్ సాంగ్) పోటీ పడుతున్నారు. ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అమెరికన్ ఫిక్షన్ (కార్డ్ జెఫెర్సన్)..బార్బీ (గ్రెటా గెర్విగ్ మరియు నోహ్ బాంబాచ్) ..ఓపెన్‌హైమర్ (క్రిస్టోఫర్ నోలన్).. పూర్ థింగ్స్ (టోనీ మెక్‌నమరా).. ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (జోనాథన్ గ్లేజర్) పోటీ పడుతు న్నారు.
ఉత్తమ యానిమేషన్ చిత్రం నుంచి `ది బాయ్ అండ్ ది హెరాన్`.. `ఎలిమెంటల్`.. `నిమోనా`.. `రోబోట్ డ్రీమ్స్`.. `స్పైడర్ మాన్: స్పైడర్-వెర్స్` పోటీ పడుతున్నాయి. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కోసం అమెరికన్ ఫిక్షన్ (లారా కార్ప్‌మాన్)..ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ (జాన్ విలియమ్స్).. కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ (రాబీ రాబర్ట్‌సన్).. ఓపెన్‌హైమర్ (లుడ్విగ్ గోరాన్సన్).. పూర్ థింగ్స్ (జెర్కిన్ ఫెండ్రిక్స్) పోటీ లో ఉన్నాయి. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ నుంచి ప్లామిన్ హాట్...బార్బీ..అమెరికన్ సింఫనీ..కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ చిత్రాల పాటలు పోటీలో ఉన్నాయి.
ఉత్తమ డాక్యుమెంటరీ నుంచి `బాబీ వైన్: ది పీపుల్స్ ప్రెసిడెంట్`.. `ది ఎటర్నల్ మెమర`.. `ఫోర్ డాటర్స్`..` టు కిల్ ఏ టైగర్`.. `20 డేస్ ఇన్ మారిపోల్` చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఉత్తమ ఛాయాగ్రాహణం నుంచి `ఎల్ కాండే` (ఎడ్వర్డ్ లచ్మన్).. `కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్` (రోడ్రిగో ప్రిటో).. `మాస్ట్రో` (మాథ్యూ లిబాటిక్)..`ఓపెన్‌హైమర్` (హోయ్టే వాన్ హోటెమా)..`పూర్ థింగ్స్` (రాబీ ర్యాన్) పోటీ పడుతున్నారు. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ `బార్బీ`.. `కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్`.. `నెపోలియన్`.. `ఓపెన్‌హైమర్`..పూర్ థింగ్స్ చిత్రాలు పోటీలో ఉన్నాయి. బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ లో `అనాటమీ ఆఫ్ ఎ ఫాల్`.. `హోల్డోవర్స్`.. `కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్`.. `ఓపెన్‌హైమర్`.. పూర్ థింగ్స్ చిత్రాలున్నాయి.
ఉత్తమ సౌండ్ విభాగం నుంచి ది క్రియేటర్.. `మాస్ట్రో`.. `మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ వన్`.. `ఓపెన్‌హైమర్`.. `ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్` చిత్రాలు పోటీలో ఉన్నాయి. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ `ది క్రియేటర్` ..`గాడ్జిల్లా మైనస్ వన్`.. `గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూం 3`.. `మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ వన్`.. `నెపోలియన్` చిత్రాలున్నాయి. బెస్ట్ మ్యాకప్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ `గోల్డా`..`మాస్ట్రో`.. `ఓపెన్‌హైమర్`.. `పూర్ థింగ్స్``సొసైటీ ఆఫ్ ది స్నో` చిత్రాలు నిలిచాయి. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ జాబితాలో `ది ఆప్టర్`..ఇన్ విన్స్ బుల్..`నైట్ ఆఫ్ ఫార్చ్యూన్`..రెడ్ వైట్ అండ్ బ్లూ.. `ది వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్` చిత్రాలు పోటీలో ఉన్నాయి.