ఆస్కార్ అమ్మితే 82 రూపాయలిస్తారా?
అంతటి ప్రత్యేకత కేవలం ఆస్కార్ మాత్రమే ఉంది.
By: Tupaki Desk | 11 March 2024 12:37 PM GMTఆస్కార్ అవార్డు అంటే సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు అన్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని సినిమాల్లో కొన్నింటిని ఎంపిక చేసి వాటిలో వివిధ విభాగాల్లో ఏటా అవార్డులు అందిస్తుంటారు. సినిమా రంగంతో పాటు దాంతో సంబంధం లేని వారు కూడా మన సినిమాకి ఆస్కార్ వస్తే బాగుండే? అన్న ఫీలింగ్ ప్రతీ పౌరుడిలోనూ ఉంటుంది. అంతటి ప్రత్యేకత కేవలం ఆస్కార్ మాత్రమే ఉంది.
సినిమా రంగంలోకి కృషి చేసిన వారికి ప్రపంచ దేశాల్లో ఎన్నో రకాల అవార్డులున్నాయి. కానీ అన్నింటి కన్నా ఆస్కార్ మాత్రమే ముద్దు అని అంతా అనే మాట. ఈ ఏడాది కూడా ఆ వేడుక ఘనంగా జరిగింది. ఇంతకీ ఆస్కార్ అవార్డు అంటే ఏంటి? గెలిచిన వారికి ఏమిస్తారు? అంటే ఇందులో విజేతకు ఎలాంటి ప్రైజ్ మనీ ఉండదు. కేవలం బంగారంతో పూసిన ట్రోపీ మాత్రమే బహుకరిస్తారు. మనదేశంలో అయితే అవార్డుతో పాటు నగదు కూడా బహుకరిస్తారు. కానీ ఆస్కార్ వస్తే అవార్డు తప్ప ఎలాంటి నగదు ఉండదు.
దీనిని కాంస్యంతో తయారుచేస్తారు. 24 క్యారెట్ల బంగారంతో పూత పూస్తారు. ట్రోఫీని తయారు చేయడానికి 1000 డాలర్లు పడుతుంది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు 82 వేల రూపాయలు. కానీ ఆ అవార్డు దక్కితే ఎన్నో పరోక్ష ప్రజయోనాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కడంతో పాటు పెరుగుతుంది. ఇతర భాషల్లోనూ అవకాశాలు వస్తాయి. పారితోషికం కూడా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. విజేత ఆస్కార్ ట్రోపిని అమ్ముకునే హక్కు కలిగి ఉంటాడు.
అయితే ఈ అమ్మకం కేవలం అకాడమీకి మాత్రమే అమ్మాలి. అలా అమ్మితే 1 డాలర్ వస్తుంది. అంటే 82 రూపాయలు. బయటవారికి అమ్మడానికి వీలులేదు. పంపిణీ చేసే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్ సైన్స్ కొన్ని నియమ నిబంధలు విధించింది. విజేతలంతా అందుకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. గత ఏడాది తెలుగు సినిమా `ఆర్ ఆర్ ఆర్` లోని `నాటు నాటు` పాటకు కూడా ఆస్కార్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.