ఆ కేటగిరికి కూడా ఆస్కార్‌లో అవార్డ్స్
అదే స్టంట్ కొరియోగ్రఫీ. ఈ విభాగానికి అవార్డులు మొదలుపెట్టిన దగ్గరి నుంచి అవార్డుల్ని అందించడం లేదు.
By: Tupaki Desk | 11 April 2025 5:39 AMగ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ల కలయికలో జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పాన్ ఇండియా మూవీ `RRR`. ఈ మూవీ ఎన్నో ఏళ్ల భారతీయుల కలని నిజం చేసి ప్రపంచ సిని యవనికపై భారతీయ జెండా రెపరెపలాడేలా చేసింది. ఇందులోని `నాటు నాటు` పాటకు గానూ `RRR`కు ఆస్కార్ దక్కడం తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరి దృష్టి ఆస్కార్ అవార్డులపై పడింది. ఇప్పటి వరకు వివిధ విభాల్లో అవార్డుల్ని అందించిన ఆస్కార్ ఇంత వరకు ఓ విభాగాన్ని మాత్రం విస్మరిస్తూ వస్తోంది.
అదే స్టంట్ కొరియోగ్రఫీ. ఈ విభాగానికి అవార్డులు మొదలుపెట్టిన దగ్గరి నుంచి అవార్డుల్ని అందించడం లేదు. అయితే తాజాగా దీనిపై నిర్ణయం తీసుకున్న ఆస్కార్ కమిటీ ఫైనల్‌గా రానున్న అవార్డుల్లో యాక్షన్ కొరియోగ్రఫీకి అవార్డుల్ని అందించాలని నిర్ణియంచింది. ఇందులో భాగంగా ఆస్కార్ అకాడమీ అధికారిక ప్రకటనని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా శుక్రవారం ప్రకటించింది. ఈ సందర్భంగా హాలీవుడ్ సినిమాల యాక్షన్ దృష్యాలతో పాటు `RRR` ఫైట్‌సీక్వెన్స్‌కు సంబంధించిన స్టిల్‌ని షేర్ చేయడం విశేషం.
ఆస్కార్ అకాడమీ తాజా ప్రకటనపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే నిర్ణాయన్ని కమిటీ రెండు మూడేళ్ల క్రితం తీసుకుంటే `RRR`కు ఖచ్చితంగా దక్కేదని సినీ ప్రియులు కామెంట్ చేస్తుఎన్నారు.ఇదిలా ఉంటే ఆస్కార్ కమిటీ యాక్షన్ కొరియోగ్రఫీ విభాగానికి 2027వ సంవత్సరానికి గానూ 2028 నుంచి అందించాలని నిర్ణయించుకుంది. ఇది 100వ అకాడమీ అవార్డుల వేడుక. వందవ పురస్కారాల్లో యాక్షన్ విభాగానికి సంబంధించిన అవార్డులని ప్రకటించబోతుండటంతో ఆ విభాగానికి చెందిన యాక్షన్ కొరియోగ్రాఫర్స్ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.