ఓటీటీ దసరా స్పెషల్.. మీరేం చూస్తారు?
మరి అక్టోబర్ 2వ వారం వీకెండ్ కు అందుబాటులో ఉన్న వెబ్ సిరీసులు, సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
By: Tupaki Desk | 12 Oct 2024 4:40 PMఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు రోజురోజుకు క్రేజ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఆయా ఓటీటీల్లో ఏ ఏ సినిమాలు, వెబ్ సిరీసులు.. వస్తాయోనని ప్రతి వారం ఓటీటీ లవర్స్ వెయిట్ చేస్తుంటారు. అందుకు తగ్గట్లే నిర్వాహకులు కూడా కొత్త కంటెంట్ ను ప్రతి వారం తీసుకొస్తారు. పోటీ మరీ కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఓటీటీ లవర్స్ దృష్టిని తమ వైపు తిప్పుకునేందుకు చూస్తుంటారు. మరి అక్టోబర్ 2వ వారం వీకెండ్ కు అందుబాటులో ఉన్న వెబ్ సిరీసులు, సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
మత్తు వదలరా 2- శ్రీసింహ, సత్య ప్రధాన పాత్రలు పోషించిన మూవీ మత్తు వదలరా 2.. నెట్ ఫిక్స్ లో అందుబాటులోకి వచ్చేసింది. రితేష్ రాణా దర్శకత్వం వహించిన ఆ క్రైమ్ కామెడీ చిత్రం థియేటర్లలో మంచి విజయం సాధించింది.
తత్వ- క్రైమ్ థ్రిల్లర్ మూవీ తత్వ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి నేరుగా స్ట్రీమింగ్ అవుతోంది. రుత్విక్ యెలగారి దర్శకత్వం వహించిన మూవీ అక్టోబర్ 10వ తేదీ నుంచి అందుబాటులో ఉంది.
పైలం పిలగా- తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన లవ్ కామెడీ మూవీ పైలం పిలగా అక్టోబర్ 10వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది. సాయి తేజ, పావని కరణం ప్రధాన పాత్రలు పోషించగా ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించారు.
గొర్రె పురాణం- యంగ్ హీరో సుహాస్ నటించిన గొర్రె పురాణం సినిమా థియేటర్లలో రిలీజైన 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. అక్టోబర్ 10 నుంచి ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవుతోంది.
ఉత్సవం- దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో నటించిన ఉత్సవం.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అర్జున్ సాయి దర్శకత్వం వహించారు.
శబరి- స్టార్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ యాక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
అక్షయ్ కుమార్ కామెడీ మూవీ ఖేల్ ఖేల్ మే నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. బ్లాక్ బస్టర్ హిందీ మూవీ స్త్రీ-2.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అక్షయ్ కుమార్ నటించిన సూరరై పొట్రు హిందీ రీమేక్ చిత్రం సర్ఫిరా ఇప్పుడు డిస్నీ+ హాట్‌స్టార్ లో అలరిస్తోంది. సోనీ లివ్ లో మంచి రెస్పాన్స్ అందుకుంటున్న రాత్ జవాన్ హై వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది.
జాన్ అబ్రహం హీరోగా నటించిన యాక్షన్ డ్రామా మూవీ వేదా.. జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కోలీవుడ్ మూవీ పోగుమిడం వేగు తూరమిల్లై తెలుగు డబ్బింగ్ వెర్షన్.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. మారి సెల్వరాజ్ వాజై మూవీ తెలుగు వెర్షన్ డిస్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం సెటైరికల్ డ్రామా వెబ్ సిరీస్ జై మహేంద్రన్ సీజన్-1 తెలుగు వెర్షన్ సోనీ లివ్ లో అందుబాటులోకి వచ్చింది.