Begin typing your search above and press return to search.

థియేట్రిక‌ల్ రిలీజ్ ల‌ను ఓటీటీలు శాషిస్తున్నాయా?

హిట్ అయినా ప్లాప్ అయినా? ఓటీటీ చెప్పిన‌ట్లు చేసాం కాబ‌ట్టి ఎలాగూ ఎంతో కొంత‌కు రైట్స్ తీసుకుంటార‌నే ధీమా ఉంటుంది.

By:  Tupaki Desk   |   26 Jan 2025 10:30 AM GMT
థియేట్రిక‌ల్ రిలీజ్ ల‌ను ఓటీటీలు శాషిస్తున్నాయా?
X

సినిమా థియేట్రిక‌ల్ రిలీజ్ ల‌ను కూడా ఓటీటీలు శాషిస్తున్నాయా? ఓటీటీలు చెప్పిన కండీష‌న్ ప్రకార‌మే సినిమా రిలీజ్ అవ్వాల్సిన ప‌రిస్థితి ఉందా? వాళ్లు చెప్పిన రిలీజ్ ఫార్మెట్ నే నిర్మాత‌లు పాటించాల్సిన ప‌రిస్థితులు దాప‌రిచించాయా? అంటే స‌న్నివేశం అలాగే కనిపిస్తోంది. సినిమా ఓటీటీ బిజినెస్ విష‌యంలో కంపెనీలు కొండెక్కి కూర్చోవ‌డంతో? కొన్ని సినిమాలు.... కొంత మంది నిర్మాత‌లు ఓటీటీల నుంచి ఇబ్బందులు ఎదుర్కోంటోన్న సంగ‌తి తెలిసిందే.

ప్లాప్ ల్లో ఉన్న హీరోల సినిమాల ప‌రిస్థితి అయితే మ‌రీ దారుణంగా క‌నిపిస్తుంది. చియాన్ విక్ర‌మ్ న‌టించిన 'వీర ధీర సూర‌న్ 2'జ‌న‌వ‌రిలో రిలీజ్ అవ్వాలి. కానీ ఓటీటీ మార్చిలో రిలీజ్ చేయాలి? అనే కండీష‌న్ పెట్ట‌డంతో థియేట్రిక‌ల‌ర్ రిలీజ్ వాయిదా వేసుకోవాల్సి వ‌చ్చింది. అలా చేసుకుంట‌నే ఓటీటీ రైట్స్ తీసుకుం టామానే నిబంధన పెట్ట‌డంతో చేసేందేం లేక వాళ్లు చెప్పిన‌ట్లు చేయాల్సి వ‌స్తోంది. వాళ్లు చెప్పిన‌ట్లు చేస్తే సేఫ్ జోన్ లో ఉండొచ్చు అన్న‌ది నిర్మాత ప్లాన్.

హిట్ అయినా ప్లాప్ అయినా? ఓటీటీ చెప్పిన‌ట్లు చేసాం కాబ‌ట్టి ఎలాగూ ఎంతో కొంత‌కు రైట్స్ తీసుకుంటార‌నే ధీమా ఉంటుంది. అలాగే మోహన్ లాల్ నటించిన 'తుడారుమ్' కూడా జ‌న‌వ‌రి 30న రిలీజ్ అవ్వాలి. కానీ ఈ సినిమా ఏకంగా మేకి వాయిదా ప‌డిందనే ప్ర‌చారం జ‌రుగుతోంది. కార‌ణం ఏంటా? అని ఆరా తీయ‌గా ఓటీటీ తో ఒప్పందం కుద‌ర‌క పోవ‌డంతోనే ఇలా వాయిదా వేయాల్సి వ‌చ్చింద‌న్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

ముందుగా ప్రీ థియేట్రికల్ రిలీజ్ ఒప్పందానికి స‌ద‌రు ఓటీటీ ఒకే చెప్పిందిట‌. కానీ ప్రాజెక్ట్ సంత‌కం చేరే ద‌శ‌కు చేరుకున్న స‌మ‌యంలో రిలీజ్ త‌ర్వాత ఒప్పందం చేసుకుందామ‌నే వాదన తెచ్చిందిట‌. అదే స‌మ‌యంలో రిలీజ్ తేదీ కూడా తామే చెబుతాం? అన్న‌ట్లు స‌ద‌రు ఓటీటీ వ్య‌వ‌హ‌రించిందిట . దీంతో చేసేదేం లేక రిలీజ్ వాయిదా ప‌డింది. అగ్ర హీరోల సినిమాల విష‌యంలోనే ప‌రిస్థితి ఇలా ఉందంటే? మిగ‌తా హీరోల ప‌రిస్థితి చెప్పాల్సిన ప‌నిలేదు.