Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటీటీ.. ట్రేండింగ్ లో డిఫరెంట్ సినిమాలు

ఇంటర్నేషనల్ లెవల్ లో ఉన్న ఓటీటీ స్ట్రీమింగ్ యాప్స్ లలో అంతర్జాతీయంగా చాలా భాషల కంటెంట్ ప్రేక్షకుల ముందుకొస్తుంది.

By:  Tupaki Desk   |   5 Oct 2024 12:30 AM GMT
ఈ వారం ఓటీటీ.. ట్రేండింగ్ లో డిఫరెంట్ సినిమాలు
X

డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కి ప్రేక్షకులు బాగా అలవాటు పడిపోయారు. బిగ్ స్క్రీన్ పై ప్రతివారం రిలీజ్ అయ్యే సినిమాల కంటే ఓటీటీలో కొత్తగా ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి.. అందుబాటులోకి వచ్చిన ఇంటరెస్టింగ్ సిరీస్ లు ఏంటి అనేది చూస్తున్నారు. ప్రేక్షకుల అభీష్టం మేరకు డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలని ప్రేక్షకులకి అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ లెవల్ లో ఉన్న ఓటీటీ స్ట్రీమింగ్ యాప్స్ లలో అంతర్జాతీయంగా చాలా భాషల కంటెంట్ ప్రేక్షకుల ముందుకొస్తుంది.


ఇక ఇండియన్ ఆడియన్స్ మొదటి ప్రాధాన్యత ఎల్లప్పుడూ ఇండియన్ సినిమాలు, వెబ్ సిరీస్ లకే ఉంటుంది. వాటిని దృష్టిలో ఉంచుకొని స్ట్రీమింగ్ యాప్స్ కొత్త సినిమాలని థియేటర్స్ లో రిలీజ్ అయిన 4-5 వారాల్లోనే ఓటీటీలోకి తీసుకొస్తున్నాయి. అలా ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యి సందడి చేస్తోన్న మూవీస్ లలో చూసుకుంటే ఇళయదళపతి విజయ్ ‘ది గోట్’ ట్రెండింగ్ లో ఉంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అక్టోబర్ 3న రిలీజ్ అయ్యింది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటించాడు. థియేటర్స్ లో ఫెయిల్ అయిన ఈ సినిమాని ఓటీటీ ఆడియన్స్ ఎంత వరకు ఆధరిస్తారనేది వేచి చూడాలి. నివేదా థామస్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ‘35 చిన్న కథ కాదు’ మూవీ ఆహాలో అక్టోబర్ 2న రిలీజ్ అయ్యింది. థియేటర్స్ లో కూడా ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంది.

ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ మూవీ బాగా కనెక్ట్ అయ్యింది. నివేదా థామస్ సాధారణ గృహిణి క్యారెక్టర్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. ఇది ఆహా ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంది. అలాగే హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ‘కళింగ’ అనే మూవీ కూడా అక్టోబర్ 3న ఆహాలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. డిఫరెంట్ కంటెంట్ తో మైథలాజికల్ ఫిక్షనల్ హర్రర్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు.

హర్రర్ థ్రిల్లర్ కథలు ఇష్టపడేవారికి కళింగ నచ్చుతుంది. ఇక హిందీలో ఫస్ట్ గే లవ్ స్టోరీగా తెరకెక్కిన అమర్ ప్రేమ్ కి ప్రేమ్ కహానీ జియో సినిమాలో రిలీజ్ అయ్యింది. కొత్తదనం ప్రేమకథలు, గే లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చే ఛాన్స్ ఉంది. 2020 కరోనా సమయంలో ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్న స్పానిష్ మూవీ ‘ది ప్లాట్ ఫామ్’ సీక్వెల్ ‘ది ప్లాట్ ఫామ్ 2’ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఉన్న ఈ మూవీ ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంది. థ్రిల్లర్ జోనర్ కథలు ఇష్టపడే ఆడియన్స్ కి ఈ మూవీ నచ్చుతుంది.