Begin typing your search above and press return to search.

డిజిటల్ లో కూడా దెబ్బ పడిందే..

డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ కి ఇండియా అతి పెద్ద మార్కెట్ అనే సంగతి అందరికి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Oct 2024 1:30 AM GMT
డిజిటల్ లో కూడా దెబ్బ పడిందే..
X

డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ కి ఇండియా అతి పెద్ద మార్కెట్ అనే సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిజిటల్ వీడియో ప్లాట్ ఫార్మ్ లు ఇండియాలో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్నాయి. ప్రపంచంలోనే నెంబర్ వన్ వీడియో షేరింగ్ అండ్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ యుట్యూబ్ కి అత్యధిక యూజర్స్ ఇండియాలోనే ఉన్నారు. అలాగే ఓటీటీ స్ట్రీమింగ్ యాప్స్ కి కూడా ఇండియా అతి పెద్ద మార్కెట్ అని చెప్పొచ్చు.

ముఖ్యంగా 2020 కరోనా తర్వాత ఒక్కసారిగా డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ కి ఇండియాలో ఆదరణ పెరిగింది. థియేటర్స్ క్లోజ్ కావడం, టెలివిజన్ ఛానల్స్ లలో కూడా కంటెంట్ లేకపోవడంతో ఎంటర్టైన్మెంట్స్ కోసం ప్రేక్షకులు ఓటీటీలు చూడటం అలవాటు చేసుకున్నారు. దీంతో గణనీయంగా ఓటీటీలకి సబ్ స్క్రైబర్స్ పెరిగారు. ఇండియాలో పెరిగిన మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని స్ట్రీమింగ్ సంస్థలు కంటెంట్ కోసం వేలకోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం ఆరంభించాయి.

సినిమాలని భారీ ధరలకు కొనుగోలు చేసి ఓటీటీలలో రిలీజ్ చేయడం ద్వారా సబ్ స్క్రైబర్స్ ని పెంచుకునే ప్రయత్నం చేశాయి. దీంతో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లాంటి అంతర్జాతీయ స్ట్రీమింగ్ సంస్థల వృద్ధి గణనీయంగా పెరిగింది. ఇప్పటికి ఈ స్ట్రీమింగ్ కంపెనీలు స్టార్ హీరోల సినిమాల డిజిటల్ రైట్స్ కోసం భారీగా ఖర్చు చేస్తూ ఉంటాయి. అయితే గత కొన్నేళ్ల నుంచి ఈ స్ట్రీమింగ్ యాప్స్ కి ఆదరణ తగ్గుతోందని టాక్ వినిపిస్తోంది.

దీనికి కారణం ఆడియన్స్ కి ఎలాంటి కంటెంట్ కావాలో అంచనా వేయలేకపోవడమే. థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాల డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసి నాలుగు వారాల గ్యాప్ లో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. వీటికి కొన్నింటికి ఆదరణ వస్తోంది. థియేటర్స్ లో హిట్ అయిన సినిమాలనే ఓటీటీలో కూడా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. పబ్లిక్ అటెన్షన్ లేని మూవీస్ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయనేది కూడా ఎవరికి తెలియడం లేదు.

2021లో ఇండియాలో 225 సినిమాలు, వెబ్ సిరీస్ ల రూపంలో ఇండియన్ కంటెంట్ ఓటీటీలలో రిలీజ్ అయ్యాయి. 2023లో ఆ నెంబర్ 199కి తగ్గింది. 2023లో మరల 206 ఇండియన్ మూవీస్, సిరీస్ లు ఓటీటీలో అందుబాటులోకి వచ్చాయి. ఓటీటీ సంస్థలు 2022లో 529 మిలియన్ డాలర్స్ ఇండియన్ కంటెంట్ పైన పెట్టుబడి పెట్టాయి. 2023లో అది 479 మిలియన్ డాలర్స్ కి తగ్గిపోయింది. మరల 2024లో 527 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు.

యూఎస్ లో ఆర్ధిక మద్యం కూడా ఓటీటీ సంస్థలు ఇండియన్ కంటెంట్ పై పెట్టిన పెట్టుబడులు తగ్గడానికి ఒక కారణం అనే మాట వినిపిస్తోంది. అలాగే ఆడియన్స్ కి ఎలాంటి కంటెంట్ కావాలో అంచనా వేయలేకపోవడం వలన సెలక్టివ్ గా మూవీస్ ని కొనుగోలు చేస్తున్నారు. ఒరిజినల్స్ గా తెరకెక్కుతోన్న సిరీస్ లకి పెద్దగా ఆదరణ రావడం లేదు. ఈ కారణంగా కొత్త సబ్ స్క్రైబర్స్ పెరగడం లేదు. ఇక ఓటీటీలలో కొత్త కంటెంట్ ఉండటం లేదని మళ్ళీ జనాలు సబ్ స్క్రైబ్ రెన్యూవల్ చేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదనే మాట వినిపిస్తోంది.