Begin typing your search above and press return to search.

ఓటీటీ కంటెంట్.. ఒక్కరోజే 23 సినిమాలు

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతోన్న కంటెంట్ చూసుకుంటే ఇలా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   25 Oct 2024 5:27 AM GMT
ఓటీటీ కంటెంట్.. ఒక్కరోజే 23 సినిమాలు
X

ఓటీటీ వినోదానికి అస్సలు డోకా ఉండదు. ప్రతి వారం సినిమాలు, వెబ్ సిరీస్ ల రూపంలో విభిన్న కథలు. డిఫరెంట్ భాషల నుంచి ప్రేక్షకుల ముందుకొస్తాయి. వీటిలో కొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీ ఆడియన్స్ ముందుకొస్తాయి. మరికొన్ని నేరుగా రిలీజ్ అవుతాయి. అలాగే ఎప్పటికప్పుడు విభిన్న కథలతో ప్రేక్షకులని థ్రిల్ చేసే వెబ్ సిరీస్ లు కూడా వస్తున్నాయి. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతోన్న కంటెంట్ చూసుకుంటే ఇలా ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్ లో శ్రీవిష్ణు ‘స్వాగ్’ మూవీ ఈ రోజే ప్రేక్షకుల ముందికొచ్చింది. థియేటర్స్ లో ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. అలాగే తెలుగు డబ్బింగ్ మూవీ ‘క్లౌడీ మౌంటెన్’ కూడా అక్టోబర్ 25న రిలీజ్ అయ్యింది. తమిళ్ చిత్రం ‘కడైసి ఉలగ పోర్’, హిందీ మూవీ ‘జ్విగటో’ నేటి నుంచి స్ట్రీమింగ్ లో ఉండబోతున్నాయి. వీటిలో దీని కెక్కువ ఆదరణ వస్తుందనేది చూడాలి. ఇక నెట్ ఫ్లిక్స్ లో కార్తి, అరవింద్ స్వామి కాంబినేషన్ లో వచ్చిన ‘సత్యం సుందరం’ రిలీజ్ అయ్యింది. ఏకంగా ఐదు భాషలలో ఈ మూవీ ఓటీటీ ఆడియన్స్ లో అలరించబోతోంది.

కృతి సనన్ హిందీ మూవీ ‘దో పత్తి’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఈ రోజు స్ట్రీమింగ్ లోకి వచ్చింది. జీ5లో ‘ఐంధమ్ వేదమ్’ తమిళ్ వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్ ప్రసారంలోకి రావడం గమనార్హం. అలాగే హిందీ మూవీ ‘ఆయ్ జిందగీ’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. బుక్ మై షోలో ‘స్ట్రేంజ్ డార్లింగ్’ ఇంగ్లీష్ మూవీ తెలుగు వెర్షన్ రెంటల్ బేసిస్ లో అందుబాటులోకి వచ్చింది. లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో హాలీవుడ్ మూవీ ‘లెజెండ్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అయ్యింది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’ సీజన్ 5 హిందీ సిరీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆహా ఓటీటీలో నందమూరి నటసింహం బాలయ్య హోస్టింగ్ చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 4 ప్రారంభం అయ్యింది. జియో సినిమాలో ‘ది మిరండా బ్రదర్స్’ హిందీ మూవీ స్ట్రీమింగ్ లోకి వచ్చింది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

స్వాగ్ (తెలుగు చిత్రం

కడైసి ఉలగ పోర్ (తమిళ చిత్రం)

జ్విగటో (హిందీ చిత్రం)

నౌటిలస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

లైక్ ఏ డ్రాగన్: యాకుజా (జపనీస్ వెబ్ సిరీస్)

క్లౌడీ మౌంటెన్ (తెలుగు డబ్బింగ్ మాండరీన్ చిత్రం)

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

సత్యం సుందరం (తెలుగు డబ్బింగ్ తమిళ చిత్రం)

దో పత్తి (తెలుగు డబ్బింగ్ హిందీ చిత్రం)

డోంట్ మూవ్ (ఇంగ్లీష్ సినిమా)

హెల్ బౌండ్ సీజన్ 2 (కొరియన్ వెబ్ సిరీస్)

ది లాస్ట్ నైట్ ఎట్ ట్రెమోర్ బీచ్ (స్పానిష్ వెబ్ సిరీస్)

పొసెషన్: కెరసుకాన్ (ఇండోనేషియన్ హారర్ డ్రామా చిత్రం)

జీ5 ఓటీటీ

ఐంధమ్ వేదమ్ (తెలుగు డబ్బింగ్ తమిళ వెబ్ సిరీస్)

ఆయ్ జిందగీ (హిందీ చిత్రం)

బుక్ మై షో ఓటీటీ

ది ఎక్స్‌టార్షన్ (స్పానిష్ చిత్రం)

స్ట్రేంజ్ డార్లింగ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సినిమా)

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

లెజెండ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సినిమా)

డెమోనిక్ (ఇంగ్లీష్ మూవీ)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)

ఆహా ఓటీటీ- అక్టోబర్ 25

అన్‌స్టాపబుల్ సీజన్ 4 (తెలుగు టాక్ షో)

యాపిల్ ప్లస్ టీవీ- అక్టోబర్ 25

బిఫోర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

-జియో సినిమా ఓటీటీ - ది మిరండా బ్రదర్స్ (హిందీ మూవీ)

స్పీక్ నో ఈవిల్ (ఇంగ్లీష్ సినిమా) - అమెజాన్ ప్రైమ్ (రెంటల్), జీ5 ఓటీటీ, బుక్ మై షో