Begin typing your search above and press return to search.

యానిమ‌ల్ OTT వెర్షన్ మ‌రింత మెరుగ్గా

ప్రస్తుతం యానిమల్ OTT అడాప్టేషన్ డెవలప్‌మెంట్ ప‌నుల్లో బిజీగా ఉన్నాన‌ని వెల్లడించాడు. OTT వెర్ష‌న్ కోసం సవరించిన విజువ‌ల్స్ తో సినిమాని రిలీజ్ చేస్తామ‌ని అన్నారు.

By:  Tupaki Desk   |   24 Dec 2023 4:20 AM GMT
యానిమ‌ల్ OTT వెర్షన్ మ‌రింత మెరుగ్గా
X

యానిమల్ థియేట్రికల్ వెర్షన్‌లో లోపాలు ఉన్నాయని సందీప్ రెడ్డి వంగా తాజా ఇంట‌ర్వ్యూలో వెల్లడించారు. OTT వెర్షన్ లో ఆ లోపాల‌ను స‌వ‌రిస్తూ మరికొన్ని షాట్‌లను జోడిస్తానని చెప్పాడు.

ప్రస్తుతం యానిమల్ సూపర్ సక్సెస్‌తో దూసుకుపోతున్న సందీప్ రెడ్డి వంగా ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నహతాతో సంభాషణలో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిపారు. ప్రస్తుతం యానిమల్ OTT అడాప్టేషన్ డెవలప్‌మెంట్ ప‌నుల్లో బిజీగా ఉన్నాన‌ని వెల్లడించాడు. OTT వెర్ష‌న్ కోసం సవరించిన విజువ‌ల్స్ తో సినిమాని రిలీజ్ చేస్తామ‌ని అన్నారు.

రణబీర్ కపూర్ త‌న సినిమాని తానే స‌మీక్షించాడు. మొదటిసారి సినిమాని వీక్షించినపుడు చాలా లోపాలు ఉన్నాయ‌ని నిజాయితీగా అంగీక‌రించాడు. పాటలో వైరుధ్యాలు, మేకప్‌లో అసమానతలు, కొన్ని సన్నివేశాలలో దుస్తుల్లో వైరుధ్యాలను అతడు గుర్తించాడు. కంటెంట్ ఆందోళనలను ప్రస్తావిస్తూ, సౌండ్ క్వాలిటీ తప్పుగా ఉందని, ఐదు వేర్వేరు భాషల్లో విడుదలలను మేనేజ్ చేయ‌డం సవాలుగా మారిందని పేర్కొన్నాడు. రిలీజ్ ముందు చివ‌రి 20 రోజుల గందరగోళం గురించి వంగా వివరించాడు. చెన్నైలో సౌండ్ చెక్‌లతో చేసిన పోరాటం గురించి సందీప్ వంగా ప్రస్తావించాడు. సవాళ్లను పరిష్కరించడానికి ఎక్కువ స‌మ‌యం త‌న‌కు దొర‌క‌లేద‌ని విచారం వ్యక్తం చేశాడు.

త‌ప్పుల‌ను సరిదిద్దే ప్రక్రియ గురించి వివరిస్తూ.. OTT వెర్షన్ కోసం తాను గుర్తించిన సమస్యలను పరిష్కరిస్తాన‌ని అన్నాడు. ఎడిటింగ్‌లో చురుకుగా పాల్గొంటున్నాను. 1-2 షాట్‌లలోని కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకే టేక్‌లోని కొన్ని అదనపు షాట్‌లు సహా విభిన్న షాట్‌లను పొందుపరచడానికి తనను ప్రేరేపించాయని పేర్కొన్నాడు. ప్రారంభ ఎడిటింగ్ నిర్ణయాన్ని ప్రతిబింబిస్తూ రన్‌టైమ్‌ను 3 గంటల 30 నిమిషాల నుండి 3 గంటల 21 నిమిషాలకు తగ్గించడంపై విచారం వ్యక్తం చేశాడు. ఆ 8-9 నిమిషాలు ఎందుకు కట్ చేశారనే దానిపై క్లారిటీ లేదన అన్నారు. సవరించిన మార్పుల ప్ర‌కారం.. ఆ 5-6 నిమిషాలను పునరుద్ధరించాలనే తన ఉద్దేశాన్ని సందీప్ వంగా ధృవీకరించాడు. ఈ చిత్రంలో బాబీ డియోల్, రష్మిక మందన్న, చారు శంకర్, ట్రిప్తి డిమ్రీ త‌దిత‌రులు కూడా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దాదాపు 850 కోట్ల వ‌సూళ్ల‌తో రికార్డులు బద్దలు కొట్టింది.

అయితే సందీప్ వంగా సుమారు 6 నిమిషాల అద‌న‌పు నిడివితో ఫుటేజీని సినిమాకి క‌లుపుతాన‌ని అన్నారు. కానీ మారిన సెన్సార్ రూల్స్ తో కొన్ని చిక్కులు ఉన్నాయ‌ని భావిస్తున్నారు. హింసాత్మ‌క స‌న్నివేశాలు, ఘాటైన స‌న్నివేశాల్లో సెన్సార్ క‌ట్స్ త‌ప్ప‌నిస‌రిగా ఉంటాయ‌ని కూడా చెబుతున్నారు.