Begin typing your search above and press return to search.

#OTT : సర్వేలో సర్‌ప్రైజింగ్‌ ఫలితం

గడచిన ఐదు సంవత్సరాల్లో ఇండియాలో ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ పరిధి విపరీతంగా పెరిగింది.

By:  Tupaki Desk   |   24 Aug 2024 4:30 PM GMT
#OTT : సర్వేలో సర్‌ప్రైజింగ్‌ ఫలితం
X

గడచిన ఐదు సంవత్సరాల్లో ఇండియాలో ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ పరిధి విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా సమయంలో సినిమా థియేటర్‌ లు మూత పడటం, టీవీ షో లు కూడా ఎక్కువ లేక పోవడంతో దాదాపు అంతా కూడా ఓటీటీ కంటెంట్‌ పై పడ్డారు. అదే అదునుగా చేసుకుని ప్రముఖ ఓటీటీలతో పాటు, కొన్ని కొత్త ఓటీటీలు కూడా ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. ఓటీటీ ల్లో సినిమాలు కేవలం నాలుగు వారాలు అంతకు తక్కువ రోజుల్లోనే స్ట్రీమింగ్‌ అవుతున్న నేపథ్యంలో ఓటీటీకి ఆధరణ మరింతగా పెరుగుతోంది.

ఇండియాలో ఓటీటీ కి పెరుగుతున్న ఆధరణ తో పాటు స్మార్ట్‌ టీవీలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో ఇండియాలో ఓటీటీ ప్రేక్షకులు అంతా కూడా టీవీలోనే చూస్తున్నారు అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. ఇటీవల ఒక ఆన్‌ లైన్ టెక్‌ సంస్థ చేసిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. ఓటీటీ కంటెంట్‌ పై అభిప్రాయ సేకరణతో పాటు ఇంకా పలు విషయాల గురించి ఆ సర్వేలో ప్రశ్నలు అడగడం జరిగింది. అయితే మీరు ఓటీటీ కంటెంట్ ను ఎక్కువగా టీవీలో చూస్తారా లేదా మొబైల్‌ లో చూస్తారా అనే ప్రశ్నకు సర్‌ప్రైజింగ్ ఫలితం వచ్చింది.

ఇండియాలో ఓటీటీ కంటెంట్‌ ను చూసే ప్రేక్షకుల్లో దాదాపు 90 శాతంకు పైగా మొబైల్‌ ఫోన్స్ లేదా ల్యాప్‌టాప్స్ వాడుతున్నారట. ఓటీటీ కంటెంట్‌ కాస్త బోల్డ్‌ గా ఉంటుంది. కనుక ఫ్యామిలీతో చూసే అవకాశం తక్కువగా ఉంటుంది. కనుక మేము ఓటీటీ కంటెంట్ ను ఎక్కువగా మొబైల్‌ లో చూస్తామని ఆ సర్వేలో చాలా మంది తమ అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. కొన్ని డీసెంట్‌ సినిమాలను మాత్రం కుటుంబంతో కలిసి ఆండ్రాయిడ్‌ టీవీలో చూస్తామని చెప్పారట.

ఎక్కువ శాతం మంది ఓటీటీ కంటెట్‌ ను మొబైల్ లో చూడటానికి మరో కారణం కూడా ఉంది. దాదాపు అన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా తమ సబ్‌స్క్రిప్షన్‌ రేట్ల విషయంలో స్మార్ట్‌ గా ఆలోచిస్తున్నారు. మొబైల్‌ వినియోగదారులకు తక్కువ రేటుకే ఓటీటీ కంటెంట్‌ ను అందిస్తున్నారు. టీవీలో చూడాలి అంటే ఇంకో రేటును తీసుకుంటున్నారు. అందుకే ఎక్కువ శాతం మంది మొబైల్ లో చూస్తే పోయేది ఏముంది అనుకుంటూ ఉన్నారట. అందుకే మొబైల్‌ కంటెంట్‌ ను సబ్‌స్క్రైబ్ చేసుకునే వారు చాలా మంది ఉన్నారు.