Begin typing your search above and press return to search.

నిర్మాత‌లంతా ఓటీటీ చెప్పిన‌ట్లు చేయాల్సిందే?

ఒక‌ప్పుడు టీవీలో.. ఓటీటీలో సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాల‌నేది? నిర్మాత డిసైడ్ చేసేవారు.

By:  Tupaki Desk   |   1 Jun 2024 1:30 PM GMT
నిర్మాత‌లంతా ఓటీటీ చెప్పిన‌ట్లు చేయాల్సిందే?
X

ఒక‌ప్పుడు టీవీలో.. ఓటీటీలో సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాల‌నేది? నిర్మాత డిసైడ్ చేసేవారు. థియేట్రిక‌ల్ రిలీజ్ అనంత‌రం అక్క‌డ ఫ‌లితాన్ని బ‌ట్టి ఇక్క‌డ రిలీజ్ చేసుకునే వెసులుబాటు క‌ల్పించే వారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివ‌ర్స్ అయింది. సినిమా ఎప్పుడు వేయాల‌న్న‌ది ఇప్పుడు పూర్తి టెలివిజ‌న్...ఓటీటీ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఓటీటీకి మార్కెట్ లో డిమాండ్ పెర‌గ‌డంతో...కంటెంట్ ప్లోటింగ్ కూడా అలాగే ఉంది.

ఏ భాష‌కు భాష‌కి సంబంధించి ఓటీటీలు సిద్దంగా ఉన్న కంటెంట్ విప‌రీతంగా రావ‌డం స‌హా 6 వారాల త‌ర్వాత రిలీజ్ చేయాలి? అన్న నిబంధన ఉండ‌టంతో ఓటీటీలే రిలీజ్ డిసైడ్ చేస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల‌కైతే ముందుగా కాస్త కొన్ని తేదీల్ని బ్లాక్ చేసి పెడుతున్నారు. అందులోనూ అది హిట్ అయితేనే. లేదంటే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఆరు వారాల కండీష‌న్ అన్న‌ది పాటించాల్సిందే అన్నంత స‌న్నివేశం మారింది. హిట్ అయితే ఆరు వారాల త‌ర్వాత ప‌ర్పెక్ట్ గా ఓటీటీలోకి వ‌స్తుంది.

లేదంటే డిలే అవ్వ‌డానికి చాలా అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఆ స్థానంలో హిట్ అయిన చిన్న సినిమాని వేసుకుం టే? మంచి ఫ‌లితాలు వ‌స్తున్నాయి. నిజానికి ఓటీటీకి పెద్ద సినిమాల‌కంటే చిన్న సినిమాల‌తోనే ఎక్కువ లాభం చేకూరుతుంద‌న్న‌ది తెలిసిందే. ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ బాగుంది అంటే వాటిని యాధావిధిగా కొన‌సాగిస్తున్నారు. లేదంటే? తూతూ మంత్రంగా ఆడించి తొల‌గిస్తున్నారు అన్న విమ‌ర్శ‌లు కూడా తెర‌పైకి వ‌స్తున్నాయి.

థియేట‌ర్లో పోయిన సినిమాలు ఓటీటీలో ఆద‌ర‌ణ‌కు నోచుకున్నవి ఉన్నాయి. అలాగే టీవీలో కూడా ఇలాంటి సినిమాల్ని ఎన్నో చూసాం. ముఖ్యంగా మ‌హేష్ `ఖ‌లేజా` సినిమా థియేట‌ర్లో ప్లాప్ అయింది. కానీ టీవీలో వేసే స‌రికి కొన్ని ల‌క్ష‌ల మంది వీక్షించిన‌ట్లు ఫ‌లితంలో తేలింది. ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ అవుతోన్న కొన్ని సినిమాల ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. అందుకే స్టార్ హీరోనే ఓటీటీ రాజు అంటే న‌మ్మే ప‌రిస్థితి లేదిప్పుడు.