Begin typing your search above and press return to search.

వీకెండ్ ఆగయా.. 22 సినిమా, సిరీస్ లు రెడీ

ఈ వారం ఓటీటీ వేదికగా పలు ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కు రెడీ అయ్యాయి.

By:  Tupaki Desk   |   27 July 2023 3:06 PM GMT
వీకెండ్ ఆగయా.. 22 సినిమా, సిరీస్ లు రెడీ
X

వీకెండ్ వచ్చేసింది. సరదాగా బయట కు పోదామనుకుంటే పోయే పరిస్థితి లేదు. వర్షాలు గట్టిగా పడుతున్నాయి. రోడ్లన్నీ జలమలమయ్యాయి. మరి ఏం చేస్తారో ఎప్పటిలాగే టీవీ ఆన్ చేసి ఓటీటీ సినిమాలు పెట్టకోని చూస్తే టైమ్ పాస్ అయిపోతది. అందుకే ఎప్పటి లాగే ఈ వారం ఓటీటీ వేదికగా పలు ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కు రెడీ అయ్యాయి. ఇప్పటికే కొన్ని అందుబాటులోకి రాగా, మరికొన్ని వీకెండ్‌ లో సందడి చేయనున్నాయి.

ఉదయనిధి స్టాలిన్‌, వడివేలు, ఫహద్‌ ఫాజిల్‌, కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం మామన్నన్‌. తెలుగు లో నాయకుడు పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జులై 27 నుంచి తమిళ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మారి సెల్వరాజ్‌ తెరకెక్కించారు. ఇంకా నెట్‌ఫ్లిక్స్‌ లో పారడైజ్‌ (హాలీవుడ్) జులై 27, హిడెన్‌ స్ట్రైక్‌ (హాలీవుడ్) జులై 27, హ్యాపీనెస్‌ ఫర్‌ బిగినెర్స్‌ (హాలీవుడ్‌) జులై 27, ది విచ్చర్‌ సీజన్‌3-పార్ట్‌-2: (వెబ్‌సిరీస్‌) జులై 27, ఎ పర్‌ఫెక్ట్‌ స్టోరీ (స్పానిష్‌) జులై 28, కెప్టెన్‌ ఫెయిల్‌ (ఇంగ్లీష్‌) జులై 28, హౌ టు బికమ్‌ ఎ కల్ట్‌ లీడర్‌ జులై 28, డీపీ సీజన్ 2 కొరియన్ సిరీస్, మిరాక్యూలస్, ద టైలర్ సీజన్ 2, ద లేడీ ఆఫ్ సీజన్ 2, ది మర్డరర్ స్ట్రీమింగ్ కానున్నాయి.

ఇక ఐటీ కంపెనీ లో జరిగిన ఓ హత్య కేసును ఛేదించే క్రమంలో పోలీసు ఆఫీసర్స్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారనే నేపథ్యంలో రూపొందిన చిత్రం పోలీస్‌ స్టోరీ: కేస్‌ 1. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌ లో ఈ నెల 28న సినిమా రిలీజ్ కానుంది. చిన్న చిత్రంగా రిలీజై బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించిన సామజవరగమన. శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జులై 28 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. నరేష్, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల ఇతర కీలకపాత్రలు పోషించారు.

నిఖిల్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం స్పై. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడు. స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా సినిమా తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జులై27 నుంచి అన్నీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రెజీనా (తమిళ్‌) కూడా స్ట్రీమింగ్‌ అవుతోంది.

'డిస్నీ +హాట్‌స్టార్‌'లో ఆషిఖానా (హిందీ సిరీస్‌) జులై 24, 'సోనీ లివ్‌'లో ట్విస్టెడ్‌ మెటల్‌ (వెబ్‌సిరీస్‌) జులై 28, 'బుక్‌ మై షో'లో జస్టిస్‌ లీగ్‌: వార్‌ వరల్డ్‌ (యానిమేషన్‌ మూవీ) జులై 23, ట్రాన్స్‌ఫార్మర్స్‌:రైజ్‌ ఆఫ్‌ ది బీస్ట్స్‌ (హాలీవుడ్‌) జులై 26, ద ఫ్లాష్‌ (హాలీవుడ్‌) జులై 27, 'అమెజాన్‌ మినీ'లో హాఫ్‌ సీఏ (హిందీ) జులై 26, 'జియో' సినిమాలో లయనెస్‌ (హాలీవుడ్‌) జులై 23, కాల్‌కూట్‌ (హిందీ) జులై 27, 'మనోరమా మ్యాక్స్‌'లో కొళ్ల (మలయాళం) జులై 27 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.