దోపిడీ క్రెడిట్ తిరస్కరణపై రైటర్స్ వార్
హాలీవుడ్ లో రచయితలు సహా టెక్నీషియన్ల సుదీర్ఘ కాల పోరాటం గురించి ఇటీవల మీడియాలో కథనాలొచ్చాయి
By: Tupaki Desk | 21 Nov 2023 4:47 AM GMTహాలీవుడ్ లో రచయితలు సహా టెక్నీషియన్ల సుదీర్ఘ కాల పోరాటం గురించి ఇటీవల మీడియాలో కథనాలొచ్చాయి. న్యాయబద్ధమన హక్కుల పరిరక్షణ కోసం రచయితలు సహా ఇతర టెక్నీషియన్లు పోరాడారు. సినిమా మేకర్స్, స్టూడియోలతో ప్రతిభను నియంత్రించడాన్ని వ్యతిరేకించారు. రచయితలు ఇతర శాఖల వారు న్యాయాన్ని కోరుతూ సుదీర్ఘకాలం పాటు సమ్మెను కొనసాగించారు. మేకర్స్ నియంత్రణ ఇంకా తమపై ఉందని నిరూపిస్తూ ఈ సమ్మె చేయడం హాట్ టాపిక్ అయింది.
అయితే హాలీవుడ్ లో సాగిన ఈ సుదీర్ఘ సమ్మె ఇతర పరిశ్రమల్ని కూడా ప్రభావితం చేస్తోంది. ఇప్పుడు భారతీయ OTT స్పేస్‌లో ఇలాంటి సమ్మె జరగవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. ఫిల్మ్ అండ్ వీడియో ఎడిటర్స్ అసోసియేషన్ FWICE ఫిర్యాదు ఇప్పుడు చర్చనీయాంశమైంది. OTT పరిశ్రమలోని సమస్యలను బహిర్గతం చేసే ఫిర్యాదు ఇది. 245 సంతకాల మద్దతుతో ఎడిటర్‌లు అపారదర్శక నియామక పద్ధతులు, వివరణ లేకుండా హఠాత్తుగా భర్తీ చేయడం, అలాగే తక్కువ-ప్రామాణిక వేతనం వంటి సమస్యల్ని ఎత్తి చూపుతూ ఆందోళనలను హైలైట్ చేశారు. సుమారు 20 మంది ఎడిటర్‌లు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు లేని సందర్భాలను షేర్ చేసారు. దోపిడీ క్రెడిట్ తిరస్కరణ అంశాలను నొక్కి చెప్పారు.
ఈ ఫిర్యాదులో రచయితలు ఎదుర్కొంటున్న సవాళ్లను లైమ్ లైట్ లోకి తెచ్చారు. OTT ప్రపంచంలో పని పరిస్థితులు సహా ఈ రంగంలో రచయితలకు సరైన గుర్తింపు, క్రెడిట్స్ కల్పించడంపైనా ఆందోళన వ్యక్తమైంది. చాలా సందర్భాలలో రచయితలకు తగినంత క్రెడిట్ ఇవ్వరు. ఆర్థికంగాను వారు అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ రంగంలో వర్క్ షెడ్యూల్ చాలా కఠినమైనది. ఇబ్బందికరమైనది.
ఓటీటీలు, సినిమా ప్రొడక్షన్ హౌస్‌ల నుఆకర్షించడం ద్వారా కీలక సమస్యలను పరిష్కరించడం ఫిర్యాదు లక్ష్యం. FWICE ప్రెసిడెంట్ బిఎన్ తివారీ నెట్ ప్లిక్స్, అమెజాన్, జీ ఇతరులకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిస్పందనలను కోరుతూ లేఖలు రాసారు. OTT పరిశ్రమలో రచయితలు లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడంలో కీలక సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. సమయం గడిచేకొద్దీ అటువంటి చర్యల ఫలితాల కోసం పరిశ్రమ కచ్చితంగా వేచి ఉంటుంది. పరిశ్రమలో అన్యాయాల నుంచి ప్రతిభావంతులను కాపాడేందుకు తగు చర్యలు తీసుకుంటారనే ఆశిద్దాం.