గోడ పోస్టర్ దశ నుంచి ఈ దశకు..
నెమ్మదిగా 2000 సంవత్సరం నాటికి చాలావరకూ ప్రచారం శైలి మారింది.
By: Tupaki Desk | 2 April 2024 5:30 PM GMTఒకప్పుడు సినిమాలకు ప్రచారం అంటే గోడపోస్టర్ కళ్ల ముందు కనిపించేది. కానీ కాలం నెమ్మదిగా మారిపోయింది. 80లు..90లలో వరకూ గోడ పోస్టర్ ట్రెండ్ నడిచింది. నెమ్మదిగా 2000 సంవత్సరం నాటికి చాలావరకూ ప్రచారం శైలి మారింది. బుల్లితెరపై రకరకాల మార్గాల్లో ప్రచారం చేయడం, అలాగే దినపత్రికల్లో, రేడియోల్లో ప్రచారం చేయించడాలు వగైరా ఉండేవి.
ఇప్పుడు డిజిటల్ మీడియా ట్రెండ్ కొనసాగుతోంది. ఓటీటీ రాజ్యమేలుతోంది. అయితే ఓటీటీ కంటెంట్ ని ప్రమోట్ చేయడమెలా? మెజారిటీ ఆడియెన్ కి రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? అన్నది ప్రశ్నిస్తే ...ఇటీవల ప్రచారానికి కొత్త పోకడలు అలవాటయ్యాయి. చింగారి, రోపోసో, ఫిల్టర్‌కాపీ, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వంటి పాపులర్ షార్ట్ వీడియో వేదికలతో చేతులు కలిపి ప్రేక్షకులను చేరుకోవడానికి ఓటీటీలు ప్రయత్నిస్తుండడం ఆసక్తికరం.
ప్రస్తుత ట్రెండ్ ని అనుసరించి ప్రతిదీ తెలివిగా ప్రయత్నిస్తున్నారని చెప్పాలి. రిలీజ్ ముందు ఓటీటీ కంటెంట్ పై ఈ షార్ట్ ఫిలిం యాప్ లు ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిన్న వీడియో ప్లాట్‌ఫారమ్‌లలో యూత్ కి చేరువవ్వడం చాలా సులువు. యూత్ ని టార్గెట్ చేస్తూ చిన్న వీడియోలను సృష్టించి కంటెంట్ కి అవసరమైన ప్రచారం చేయించుకోవడం కూడా ఈజీ. స్మాల్ టౌన్స్ లోను ఈ తరహా వీడియోలకు ప్రచారం బావుంది. అలాగే సినిమా విక్రయదారులు లైవ్ స్ట్రీమింగ్ వంటి కొత్త మార్గాల్లో యువ ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఈ ట్రెండ్ వైరల్‌లా విస్తరిస్తోంది.
డబ్బును ఇప్పుడు టీవీ కమర్షియల్స్ కంటే ఇలాంటివాటికే ఎక్కువగా నిర్మాతలు ఖర్చు చేస్తున్నారని కూడా తెలుస్తోంది. పొదుపుగా డబ్బును ఖర్చు చేస్తూ కావాల్సిన ప్రచారాన్ని దక్కించుకుంటున్నారు. నిజానికి కంటెంట్ ప్రచారానికి షార్ట్ వీడియోస్ చాలా సహకరిస్తాయి. ఇది తెలివైన పోకడ అని కూడా విశ్లేషిస్తున్నారు.