ఈ వారం ఓటీటీ లోకి వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే!
సినీ లవర్స్ కోసం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ప్రతివారం కొత్త కొత్త సినిమాలను అందిస్తున్న విషయం తెలిసిందే
By: Tupaki Desk | 29 Nov 2023 4:35 PM GMTసినీ లవర్స్ కోసం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ప్రతివారం కొత్త కొత్త సినిమాలను అందిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లు ఓటీటీ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లో విడుదలైన సినిమాలన్నీ నెల రోజులకే ఓటీటీ లో రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వారం కూడా ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లతోపాటు సినిమాలు కూడా ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న వెబ్ సిరీస్ లలో నాగచైతన్య నటించిన 'దూత' సిరీస్ పైనే అందరి దృష్టి ఉంది. ఇష్క్, మనం వంటి సినిమాలను తెరకెక్కించిన విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ ఇది. ఓటీటీకి ఎంట్రీ ఇస్తూ చైతు నటిస్తున్న ఫస్ట్ వెబ్ సిరీస్ కూడా ఇదే కావడం విశేషం. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దూత తో పాటు మరికొన్ని వెబ్ సిరీస్ లు సినిమాలు ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. వీటిలో కొన్ని నవంబర్ 30న రిలీజ్ అవుతుంటే మరికొన్ని డిసెంబర్ 1న వస్తున్నాయి. ఈవారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నెట్ ఫ్లిక్స్
1. అమెరికన్ సింఫనీ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 29
2. బ్యాడ్ సర్జన్: లవ్ అండర్ ది నైఫ్ (ఇంగ్లీష్ సిరీస్)- నవంబర్ 29
3. ఒబ్లిటెరేటడ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 30
4. ది బ్యాడ్ గాయ్స్: ఏ వెరీ బ్యాడచ్ హాలీడే (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్)- నవంబర్ 30
5. స్కూల్ స్పిరిట్స్ సీజన్ 1 (వెబ్ సిరీస్)- నవంబర్ 30
6. ఫ్యామిలీ స్విచ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 30
7. హార్డ్ డేస్ (జపనీస్ మూవీ)- నవంబర్ 30
8. ద బిగ్ అగ్లీ (2020) – నవంబర్ 30
9. వర్జిన్ రివర్ సీజన్ 5 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్)- నవంబర్ 30
10. మామాసపనో: నౌ ఇట్ కెన్ బీ టోల్డ్ – డిసెంబర్ 1
11. మిషన్ రాణిగంజ్: ద గ్రేట్ భారత్ రెస్క్యూ – డిసెంబర్ 1
12. బాస్కెట్‌బాల్ వైవ్స్, 3-4 సీజన్స్ – డిసెంబర్ 1
13. స్వీట్ హోమ్ సీజన్ 2 – డిసెంబర్ 1
14. మే డిసెంబర్ – డిసెంబర్ 1
15. ద ఈక్వలైజర్ 3 – డిసెంబర్ 1
హాట్ స్టార్
16. ద షెఫర్డ్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబర్ 1
17. ఇండియానా జోన్స్ అండ్ ద డయల్ ఆఫ్ డెస్టినీ (ఇంగ్లీష్ ) – డిసెంబర్ 1
18. మాన్‌స్టర్ ఇన్‌సైడ్: అమెరికాస్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ హాంటెడ్ హౌస్ (ఇంగ్లీష్ చిత్రం) – డిసెంబర్ 1
అమెజాన్ ప్రైమ్
19. షెహర్ లఖోట్ (హిందీ వెబ్ సిరీస్) – నవంబర్ 30
20. దూత (తెలుగు వెబ్ సిరీస్) – డిసెంబర్ 1
21. క్యాండీ కేన్ లైన్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబర్ 1
జియో సినిమా
22. 800 (తెలుగు, హిందీ మూవీ) - డిసెంబర్ 1
23. జర హట్కే జర బచ్కే (హిందీ మూవీ) - డిసెంబర్ 1