ఓటీటీ రిలీజ్..డైరెక్టర్ల స్ట్రాటజీ ఇదేనా!
ఇప్పుడంటే ఓటీటీ కంపెనీలు కాస్త స్పీడ్ తగ్గించి తెలివిగా సినిమాలు కొనుగోలు చేయడంతో సీన్ కాస్త మారింది.
By: Tupaki Desk | 19 March 2024 4:30 PM GMTథియేటర్లో రిలీజ్ అయిన సినిమానే ఓటీటీలోనూ రిలీజ్ అవుతుంది. మరి అలాంటప్పుడు థియేటర్లో చూసిన ఆడియన్స్ మళ్లీ ఓటీటీలో చూస్తారా? అదే సినిమాకి రీపీటెడ్ ఆడియన్స్ ఉంటారా? చెప్పడం కష్టమే. థియేటర్లో చూడని వారంతా హిట్ సినిమాని కచ్చితంగా ఓ టీటీలో చూస్తారు. హిట్ సినిమాలకు బుల్లి తెరపై మంచి రేటింగ్ కూడా ఉంటుంది. మార్కెట్ లో ఓటీటీల మధ్య పోటీని కూడా పెంచేది అదొక్కటే.
ఇప్పుడంటే ఓటీటీ కంపెనీలు కాస్త స్పీడ్ తగ్గించి తెలివిగా సినిమాలు కొనుగోలు చేయడంతో సీన్ కాస్త మారింది. దీంతో ఓటీటీ ఇంపాక్ట్ కాస్త తగ్గింది. హిట్ కంటెంట్ అవుతుందా? లేదా? అని అన్ని విషయాలు బేరీజు వేసుకుని కంటెంట్ కొనుగోలు చేస్తున్నారు. లేని పక్షంలో మార్కెట్ పరంగా వర్కౌట్ అయ్యే ఛాన్సు లేకపోతే పెట్టిన పెట్టుబడి కంటే తక్కువకి అడుగుతున్నారు. దీంతో ఓటీటీ సినిమా బిజినెస్ గతం కంటే తగ్గింది.
మరి థియేటర్లో చూసిన ఆడియన్స్ ని మళ్లీ ఓటీటీ సర్ ప్రైజ్ చేయడం ఎలా అంటే ? కొంత మంది మేకర్స్ కొత్తరకం స్ట్రాటజీతో వెళ్తున్నట్లు కనిపిస్తుంది. థియేటర్ రిలీజ్ లో సెన్సార్ కత్తెర వేసిన సన్నివేశాలు.. పాటల్ని ఓటీటీ రిలీజ్ లో మళ్లీ యాడ్ చేస్తున్నాడు. జవాన్.. లియో..యానిమల్..అర్జున్ రెడ్డి..హనుమాన్ కి అలాగే జరిగింది. ఆ సినిమాల్లో సెన్సార్ కత్తెర వేసిన సన్నివేశాలు..శృంగార సన్నివేశాలు ఏమైనా ఉంటే ఓటీటీ రిలీజ్ కి యాడ్ చేసి రిలీజ్ చేసారు.
దీంతో థియేటర్లో మిస్ అయిన సన్నివేశాలు ఓటీటీలో ఉన్నాయంటూ అక్కడా చూడటం పెరిగింది. రీపిటెడ్ ఆడియన్స్ కోసం మేకర్స్ వాడుతోన్న కొత్త స్ట్రాటజీ ఇది. ఇంకా అడ్వాన్స్ గా చూసుకుంటే ఓటీటీ కోసం అంటూ అదనంగా కొంత పుటేజీని ఇకపై కేటాయించే అవకాశం ఉంటుంది. ఓటీటీలో నిడివి ఎక్కు వున్నా పర్వాలేదు కాబట్టి షూట్ దశలోనే అవసరమైన గ్రిప్పింగ్ కంటెంట్ ఉంటే చివర్లో యాడ్ చేసుకుని ఓటీటీలో రిలీజ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడొస్తున్న కంటెంట్ కి ఎలాగూ కట్ లు తప్పడం లేదు కాబట్టి వాటిని కూడా యాడ్ చేసి ఓటీటీలో తెస్తే సరి.