Begin typing your search above and press return to search.

ఓటీటీ గోడవ మళ్ళీ మొదటికొచ్చింది

ఈ పరిస్థితికి ముగింపు పలకాలని కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో థియేటర్స్ అసోసియేషన్స్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   21 Feb 2024 4:06 AM GMT
ఓటీటీ గోడవ మళ్ళీ మొదటికొచ్చింది
X

2020 కరోనా సమయంలో థియేటర్స్ అందుబాటులో లేకపోవడంతో ఇంటికే పరిమితం అయిన ప్రజలు ఓటీటీ కంటెంట్ కి అలవాటు పడ్డారు. దీంతో ఒక్కసారిగా డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ లకి డిమాండ్ పెరిగింది. ఇండియాలో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందింది. ఓటీటీ ఛానల్స్ కూడా ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అందించడం కోసం కొత్త కొత్త కథలతో వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ వచ్చాయి.

అలాగే థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలని కూడా డిజిటల్ రైట్స్ రూపంలో కోట్ల రూపాయిలు చెల్లించి కొనుగోలు చేస్తున్నాయి. ఈ సినిమాలని 3, 4 వారల గ్యాప్ లో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాయి. సినిమా రిజల్ట్ బట్టి కొన్నైతే థియేటర్స్ లో రిలీజ్ అయిన రెండు వారల గ్యాప్ లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇలా ఓటీటీలో మూవీస్ తక్కువ సమయంలోనే రిలీజ్ అవుతూ ఉండటం థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి థియేటర్ ఎక్స్ పీరియన్స్ కావాలని అనుకుంటేనే వాటిని చూడటానికి వెళ్తున్నారు. పర్వాలేదు అనే టాక్ వచ్చిన కూడా ఆడియన్స్ థియేటర్స్ లో ఆ చిత్రాలు చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఓటీటీ ఛానల్స్ అమలు చేసే ఈ నాలుగు వారల విధానం కూడా థియేటర్ కలెక్షన్స్ ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. కొంతమంది థియేటర్స్ ఓనర్స్ అయితే కనీసం కరెంట్ చార్జీలు కూడా చెల్లించుకోలేకపోతున్నారు.

ఈ పరిస్థితికి ముగింపు పలకాలని కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో థియేటర్స్ అసోసియేషన్స్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇకపై ఏ సినిమా అయిన థియేటర్స్ లోకి వచ్చిన 6 నుంచి 8 వారల తర్వాత మాత్రమే ఓటీటీ ఛానల్స్ లో రిలీజ్ చేయాలని నిర్మాతలకి హుకుం జారీ చేసారంట. అలా అయితేనే సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని, లేదంటే బాయ్ కట్ చేస్తామంటూ హెచ్చరించారంట.

ఓటీటీ ఛానల్స్ సినిమా కొనాలంటే 4 వారల విండో విధానం ఒప్పుకోవాలి. థియేటర్స్ లో మూవీస్ రిలీజ్ చేయాలంటే ఇప్పుడు 8 వారల విధానంకి ఒప్పుకోవాలి. ఈ పరిస్థితి నిర్మాణాలని సంకటంలో పడేసింది. ఈ మధ్య ఓటీటీ ఛానల్స్ కూడా నాన్ థీయాట్రికల్ రైట్స్ హీరో మార్కెట్, సినిమాకి ఉన్న క్రేజ్ చూసి ఇస్తున్నాయి. దీంతో నిర్మాతలు ఈ బిసినెస్ మీదనే ఆధారపడుతున్నారు. కానీ ఓటీటీ ఛానల్స్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రాకుండా ఆపేస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట పడాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. మరి కేరళ, తమిళనాడు రాష్ట్రలలో ఎగ్జిబిటర్స్, థియేటర్స్ అసోసియేషన్స్ చేస్తోన్న ఈ డిమాండ్ ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.