Begin typing your search above and press return to search.

ఓటీటీ రిలీజ్ లిస్ట్ పెద్దదే.. ఆ రెండింటిపై స్పెషల్ ఫోకస్

అయితే ప్రతి వారంలాగే ఈ వారం కూడా మరిన్ని కొత్త సినిమాలు, సిరీస్లు అటు థియేటర్లతో పాటు ఇటు ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   31 Jan 2024 4:11 AM GMT
ఓటీటీ రిలీజ్ లిస్ట్ పెద్దదే.. ఆ రెండింటిపై స్పెషల్ ఫోకస్
X

వీకెండ్స్ వచ్చిందంటే చాలు.. సినీ లవర్స్ను అలరించేందుకు అనేక సరికొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తూనే ఉంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా సినీ ప్రియులు థియేటర్లకు బారులు తీరుతుంటారు. అయితే సిల్వర్ స్క్రీన్పై సినిమాలు చూసేందుకు వీలుపడని కొందరు ఓటీటీల్లో వాటిని చూసేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి వారి కోసం మేకర్స్ కూడా థియేటర్లలో విడుదలైన సినిమాలను కొంత కాలం తర్వాత ఓటీటీల్లోకి విడుదల చేస్తుంటారు. దీంతో వెబ్ ప్లాట్ ఫామ్లకు కూడా ఆదరణ పెరుగుతోంది.

అయితే ప్రతి వారంలాగే ఈ వారం కూడా మరిన్ని కొత్త సినిమాలు, సిరీస్లు అటు థియేటర్లతో పాటు ఇటు ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. సుహాస్‌ లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్ ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు పలు చిన్న చిత్రాలు కూడా థియేటర్లలో విడుదల కానున్నాయి..

మరోవైపు ఈ వారం ఓటీటీలో 20కుపైగా చిత్రాలు, సిరీస్ లు సందడి చేయనున్నాయి. మెగా ఇంటి కోడలు అయిన తర్వాత హీరోయిన్ లావణ్య త్రిపాఠి నటించిన మిస్ ఫెర్‌ఫెక్ట్ సిరీస్ డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక సంక్రాంతికి విడుదలైన వెంకటేశ్ సైంధవ్ మూవీ కూడా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇవి కాకుండా పలు హిందీ-ఇంగ్లీష్ సినిమాలు-సిరీసులు ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. ఆ వివరాలివే..

అమెజాన్ ప్రైమ్

డీ ప్రాంక్ షో (డచ్) - ఫిబ్రవరి 2

మిస్టర్ & మిస్ స్మిత్ (ఇంగ్లీష్) - ఫిబ్రవరి 2

డిస్నీ+హాట్‌స్టార్‌

కోయిర్ (ఇంగ్లీష్‌) - జనవరి 31

మిస్ ఫెర్‌ఫెక్ట్ (తెలుగు) - ఫిబ్రవరి 2

సెల్ఫ్ (ఇంగ్లీష్) - ఫిబ్రవరి 2

నెట్‌ఫ్లిక్స్

మైటీ భీమ్స్ ప్లే టైమ్ (ఇంగ్లీష్‌) - స్ట్రీమింగ్‌

ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లీష్‌) - స్ట్రీమింగ్‌

జాక్ వైట్ హాల్: సెటిల్ డౌన్ (ఇంగ్లీష్‌) - జనవరి 30

నాస్కర్: ఫుల్ స్పీడ్ (ఇంగ్లీష్‌) - జనవరి 30

జాక్‌ వైట్‌ హాట్‌ -సెటెల్‌ డౌన్‌ (ఇంగ్లీష్‌) జనవరి 30

అలెగ్జాండర్ : ద మేకింగ్ ఆఫ్ ఏ గాడ్ (ఇంగ్లీష్‌) - జనవరి 31

బేబీ బండిటో (ఇంగ్లీష్) - జనవరి 31

ద సెవెన్ డెడ్లీ సిన్స్ (జపనీస్) - జనవరి 31

ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్‌) - ఫిబ్రవరి 1

లెట్స్ టాక్ అబౌట్ (మాండరిన్) - ఫిబ్రవరి 2

ఓరియన్ అండ్ ద డార్క్ (ఇంగ్లీష్‌) - ఫిబ్రవరి 2

మనోరమ మ్యాక్స్

ఓ మై డార్లింగ్ (మలయాళం) - ఫిబ్రవరి 2

బుక్ మై షో

అసెడియో (స్పానిష్) - జనవరి 30

జియో సినిమా

ఇన్ ద నో (ఇంగ్లీష్‌ సిరీస్) - స్ట్రీమింగ్

జీ5

ది సిగ్నేచర్‌ (హిందీ) ఫిబ్రవరి 2

లయన్స్‌ గేట్‌ ప్లే

వన్‌ రేంజర్‌ (ఇంగ్లిష్‌/హిందీ) ఫిబ్రవరి 2