Begin typing your search above and press return to search.

సంక్రాంతి సినిమాల ఓటీటీ రిలీజ్.. అన్ని సెట్టయ్యాయి

ఈ సినిమాలకి సంబందించిన డిజిటల్ రైట్స్ ఇప్పటికే ప్రముఖ ఒటీటీ ఛానల్స్ ఫ్యాన్సీ ధరలు చెల్లించి సొంతం చేసుకున్నాయి.

By:  Tupaki Desk   |   6 Jan 2024 4:01 AM GMT
సంక్రాంతి సినిమాల ఓటీటీ రిలీజ్..  అన్ని సెట్టయ్యాయి
X

సంక్రాంతి బరిలో ఈ సారి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. అలాగే తమిళం నుంచి రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలు వేటికవే ప్రత్యేకమైనవి కావడం విశేషం. తెలుగులో నాలుగు సినిమాల మధ్య టఫ్ ఫైట్ ఉండటంతో తమిళ్ డబ్బింగ్ మూవీస్ ని సంక్రాంతికి తెలుగులో చూసే ఛాన్స్ లేదు. ఈ సినిమాలకి సంబందించిన డిజిటల్ రైట్స్ ఇప్పటికే ప్రముఖ ఒటీటీ ఛానల్స్ ఫ్యాన్సీ ధరలు చెల్లించి సొంతం చేసుకున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న గుంటూరు కారం సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ స్కేల్ పై రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. మీనాక్షి చౌదరి సెకండ్ లీడ్ చేస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమా రిజల్ట్ బట్టి డిజిటల్ రిలీజ్ ప్లాన్ చేసే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.

తేజా సజ్జా, ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ డిజిటల్ రైట్స్ ని జీ5 భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో జీ5 దక్కించుకున్న పెద్ద సినిమా ఇదే కావడం విశేషం. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఓటీటీలో కూడా ఐదు భాషలలో రిలీజ్ అవ్వనుంది. సినిమాపై అయితే పాజిటివ్ బజ్ ఉంది.

విక్టరీ వెంకటేష్ చాలా రోజుల తర్వాత చేస్తోన్న పూర్తిస్థాయిలో యాక్షన్ మూవీ సైంధవ్. కూతురు సెంటిమెంట్ ఈ మూవీలో కోర్ పాయింట్. కూతురు ప్రాణాలు కాపాడటం కోసం తండ్రి ఏం చేసాడు అనేది కథలో చూపించ బోతున్నారు. జనవరి 13న రిలీజ్ కాబోయే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోవడం విశేషం. కింగ్ నాగార్జున నా సామిరంగా కూడా సంక్రాంతి రేసులోనే జనవరి 14న రిలీజ్ కాబోతోంది.

ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని డిస్నీ హాట్ స్టార్ దక్కించుకుంది. మలయాళీ మూవీ రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మూవీపైన కింగ్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్, టీజర్స్ కూడా మూవీపై అటెన్షన్ క్రియేట్ చేసే విధంగా ఉన్నాయి. ధనుష్ హీరోగా రాబోతున్న కెప్టెన్ మిల్లర్ శివకార్తికేయన్ 100 కోట్ల బడ్జెట్ తో చేసిన ఆయలాన్ డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.