Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటీటీ కంటెంట్.. ఇదే కొత్త సరుకు

ఆ వాచ్ టైం పెంచడం కోసం ప్రేక్షకులు ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారో ట్రాక్ చేస్తూ ఆ తరహా కథల మీద ఓటీటీ సంస్థలు బడ్జెట్ పెడుతున్నాయి.

By:  Tupaki Desk   |   23 July 2024 11:31 AM GMT
ఈ వారం ఓటీటీ కంటెంట్.. ఇదే కొత్త సరుకు
X

వారం వారం డిజిటల్ యూజర్స్ ముందుకి స్ట్రీమింగ్ సంస్థలు కొత్త కొత్త కంటెంట్ లని తీసుకొని వస్తున్నాయి. భాషాపరిమితం లేకుండా వీలైనన్ని ఎక్కువ భాషలలో సినిమాలు, వెబ్ సిరీస్ లని ప్రేక్షకులకి అందిస్తున్నాయి. యూజర్ వాచ్ టైం ఎంత ఎక్కువ పెరిగితే డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలకి అంత ఎక్కువ ఆధారం ఉంటుంది. ఆ వాచ్ టైం పెంచడం కోసం ప్రేక్షకులు ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారో ట్రాక్ చేస్తూ ఆ తరహా కథల మీద ఓటీటీ సంస్థలు బడ్జెట్ పెడుతున్నాయి.

అలాగే ఈ వారం ఓటీటీలలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ ల సంగతి చూసుకుంటే అమెజాన్ ప్రైమ్ లో ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎక్కువ ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ లో హిందీ మూవీ బ్లడీ ఇష్క్ జులై 26న రిలీజ్ అవుతోంది. అలాగే తమిళ్ వెబ్ సిరీస్ చట్నీ సాంబార్ అదే రోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది. జీ5లో హిందీ మూవీ భయ్యాజీ జులై 26న డిజిటల్ ఆడియన్స్ ముందుకి వస్తోంది. మరో హిందీ సినిమా ఛల్తే రహే జిందగీ కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. ఆహాలో తమిళ్ మూవీ కాళ్ ఈ రోజు రిలీజ్ అయ్యింది.

అలాగే గ్రాండ్ మా మూవీ కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. గెటప్ శ్రీను రాజు యాదవ్ మూవీ జులై 24 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇవి కాకుండా ఇంగ్లీష్ తో పాటు ఇతర భాషలకి చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఈ వారం ప్రేక్షకులని అలరించబోతున్నాయి. అవేంటో ఓ సారి చూసుకుంటే ఎలా ఉన్నాయి.

నెట్ ఫ్లిక్స్

క్లియోక్లి సీజన్ 2 (జర్మన్ సిరీస్) – జూలై 25

ద డెకమెరన్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 25

టోక్యో స్విండ్లర్స్ (జపనీస్ సిరీస్) – జూలై 25

ఎలైట్ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 26

ఘోస్ట్ బస్టర్స్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 26

ద డ్రాగన్ ప్రిన్స్ సీజన్ 6 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 26వ

అమెజాన్ ప్రైమ్

ద మినిస్ట్రీ ఆఫ్ అన్ జెంటిల్మేన్లీ వార్ పేర్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 25వ

బ్లడీ ఇష్క్ (హిందీ మూవీ) – జూలై 26

చట్నీ సాంబార్ (తమిళ సిరీస్) – జూలై 26వ

జీ5

భయ్యాజీ (హిందీ సినిమా) – జూలై 26

ఛల్తే రహే జిందగీ (హిందీ మూవీ) – జూలై 26

ఆహా

కాళ్ (తమిళ సినిమా) – జూలై 23

గ్రాండ్ మా (తమిళ చిత్రం) – జూలై 23

రాజుయాదవ్ (తెలుగు మూవీ) – జూలై 24

ఆపిల్ ప్లస్ టీవీ

టైమ్ బండిట్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 24

జియో సినిమా

విచ్ బ్రింగ్స్ టూ మీట్ యూ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 26వ