ఈ వారం క్రేజీ కంటెంట్ తో ఓటీటీ స్టఫ్..
ఇలా వచ్చిన వాటిలో కొన్ని ట్రెండ్ అవుతోన్న వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి.
By: Tupaki Desk | 23 Feb 2024 3:48 AM GMTప్రతి వారం డిజిటల్ స్ట్రీమింగ్ ఛానల్స్ ద్వారా కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. వీటి ద్వారా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కి దొరుకుతోంది. ఇలా వచ్చిన వాటిలో కొన్ని ట్రెండ్ అవుతోన్న వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి. ఎక్కువగా థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ తరహా కథలు ఆడియన్స్ చూడటానికి ఇష్టపడుతున్నారు. ఓటీటీ సంస్థలు కూడా వాటిని నిర్మిస్తోంది.
సినిమాలలో నటించే స్టార్ యాక్టర్స్ చాలా మంది ఇప్పుడు వెబ్ సిరీస్ లు చేస్తూ ఓటీటీ బాట పడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ వారం ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ ల సంగతి చూసుకుంటే ఇలా ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ లో నెట్ ఫ్లిక్స్ అవతార్ అండ్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.. అలాగే హాలీవుడ్ మూవీ సౌత్ పా రిలీజ్ అయ్యింది.
నెట్ ఫ్లిక్స్ మూవీ మీ కుల్పా అందుబాటులోకి వచ్చింది. డాక్యుమెంటరీ సిరీస్ లకి ఈ మధ్య ఆదరణ పెరిగింది. అందులో భాగంగా ఫార్ములా 1: డ్రైవ్ టు సర్వైవ్ సీజన్ 6, ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్ డాక్యుమెంటరీ సిరీస్ లు రిలీజ్ అయ్యాయి. ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్, మార్షల్ ది షెల్ విత్ షూస్ ఆన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియో ది వించెస్టర్స్ మూవీ రిలీజ్ అయ్యింది. అలాగే అపార్ట్‌మెంట్ 404 కొరియన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. పోచర్ తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ది సెకండ్ బెస్ట్ హాస్పిటల్ ఇన్ ది గెలాక్సీ కార్టూన్ సిరీస్ నేటి నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో హాలీవుడ్ మూవీ హోల్ విల్ ట్రెంట్ సీజన్ 2, యానిమేషన్ మూవీ స్టార్ వార్స్: ది బ్యాడ్ బ్యాచ్ రిలీజ్ అయ్యాయి.
మోహన్ లాల్ పీరియాడికల్ మూవీ మలైకోట్టై వాలిబన్ అందుబాటులో ఉంది. జియో సినిమాలో సమ్మర్ హౌజ్ సీజన్ 8 వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. ఇలా ప్రేక్షకులని ఎగ్జైట్ చేసే కథలతో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ ఆడియన్స్ కి అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఎన్నింటికి ఆడియన్స్ కనెక్ట్ అవుతారనేది చూడాలి.