Begin typing your search above and press return to search.

ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలివే..

ప్రతివారం సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకి వస్తూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి

By:  Tupaki Desk   |   19 Dec 2023 12:07 PM GMT
ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలివే..
X

ప్రతివారం సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకి వస్తూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి. ఆడియన్స్ కూడా కొత్త కొత్త కంటెంట్ లని చూడటానికి ఇష్టపడుతున్నారు. అందుకే భాషలతో పరిమితం చేయకుండా అన్ని భాషలలో సినిమాలని, వెబ్ సిరీస్ లని ఓటీటీ సంస్థలు అందిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ వారం పెద్ద పెద్ద సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి.

షారుఖ్ ఖాన్ డంకీ మూవీ డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి వస్తోంది. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తాప్సి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా విక్కీ కౌశల్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాపై బిటౌన్ లో చాలా హైప్ ఉంది. ఇది ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటుంది అనేది చూడాలి.

ఇక డిసెంబర్ 22న డార్లింగ్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీ రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో ఈ మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతి బాబు, శృతి హాసన్ కీలక పాత్రలలో ఈ సినిమాలో కనిపిస్తున్నారు. హాలీవుడ్ ఆక్వా మెన్ 2 డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

మలయాళీ మూవీ నేరు డిసెంబర్ 21 థియేటర్స్ లోకి వస్తోంది. మోహన్ లాల్, ప్రియమణి లీడ్ రోల్ లో ఈ సినిమా తెరకెక్కింది. కోర్టు రూమ్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఓటీటీలో చూసుకుంటే హిందీ వెబ్ సిరీస్ ఫ్లేమ్స్ సీజన్ 4 డిసెంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. అలాగే బాలీవుడ్ మూవీ డ్రైడే డిసెంబర్ 22న రిలీజ్ అవుతోంది.

వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ డిసెంబర్ 22 నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతోంది. జియో సినిమాలో హాలీవుడ్ మూవీ బార్బీ డిసెంబర్ 21న టెలికాస్ట్ కాబోతోంది. ఈ ఏడాదికి టాలీవుడ్ నుంచి అతి పెద్ద మూవీ సలార్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా గురించి డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.