Begin typing your search above and press return to search.

సూర్య మీద ప్రేమ అనుకోవాలా లేదా మరోటా..?

తెలుగు, తమిళం లోనే కాదు పాన్ ఇండియా వైడ్ సూర్య కంగువ ఆరోజు రిలీజ్ అవుతుంది.

By:  Tupaki Desk   |   26 July 2024 6:08 AM GMT
సూర్య మీద ప్రేమ అనుకోవాలా లేదా మరోటా..?
X

ఈ ఇయర్ రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో సూర్య కంగువ కూడా ఒకటి. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకు హైలెట్ అవుతుందని అంటున్నారు. అక్టోబర్ 10న సూర్య కంగువ రిలీజ్ డేట్ లాక్ చేశారు. తెలుగు, తమిళం లోనే కాదు పాన్ ఇండియా వైడ్ సూర్య కంగువ ఆరోజు రిలీజ్ అవుతుంది.

మామూలుగా అయితే దసరా సీజన్ తెలుగు స్టార్ సినిమాల మధ్య సూపర్ ఫైట్ ఉంటుంది. కానీ ఈ దసరాకు స్టార్ సినిమాలు రావట్లేదు. ఎన్ టీ ఆర్ దేవర ముందు దసరా రిలీజ్ అనుకున్నా అనూహ్యంగా సెప్టెంబర్ 27కి మార్చారు. దసరాకి కేవలం తమిళ డబ్బింగ్ సినిమాలు కంగువ, వేటాయ్యన్ మాత్రమే రిలీజ్ అయ్యేలా ఉన్నాయి.

ఐతే సూర్య కంగువ మీద ప్రేమ వల్లే తెలుగు మేకర్స్ ఎవరు దసరాకి అతని సినిమాకు పోటీగా మరో సినిమా వదలట్లేదని అంటున్నారు. కంగువ సినిమాలో యువి క్రియేషన్స్ కూడా నిర్మాణ భాగస్వామ్యం అయ్యింది. తెలుగు నిర్మాలంతా మన సినిమాలకు మనమే పోటీ కాకుండా రిలీజ్ డేట్ ల విషయంలో కాస్త ముందు వెనక్కి జరగాలని నిర్ణయించుకున్నారు. అందుకే సంక్రాంతికి వచ్చే సినిమాల రిలీజ్ డేట్ల సర్దుబాట్లు.. ఆ తర్వాత సమ్మర్ కి ఇలా డేట్స్ అడ్జెస్ట్ చేసుకున్నారు.

నిర్మాతల మండలిని కాదని సినిమాలు రిలీజ్ చేసే అవకాశం లేదా అంటే ఉంది కానీ అది ఎంతైనా రిస్క్ తో కూడుకున్న పనే అవుతుంది. ఈ క్రమంలో ఈ దసరాని కేవలం డబ్బింగ్ సినిమాలకు వదిలేస్తూ అందులో కూడా కంగువ సినిమాను మన నిర్మాతలే డిస్ట్రిబ్యూట్ చేస్తూ సూర్య మీద ప్రేమ చూపిస్తూ బిజినెస్ విషయంలో లాభపడాలని చూస్తున్నారు. ఐతే ఇప్పటి వరకు దసరాకి తెలుగు స్టార్ సినిమా ఏది రిలీజ్ అనౌన్స్ చేయలేదు.

ఒకవేళ సడెన్ గా రేసులోకి వస్తే మాత్రం ప్లాన్ రివర్స్ అవుతుంది. ఐతే దసరాకి స్టార్స్ ఎలాగు వెనక్కి తగ్గారు కాబట్టి చిన్న సినిమాలైనా రిలీజ్ చేస్తే బెటర్ అని అంటున్నారు తెలుగు ఆడియన్స్. ఐతే సూర్య కంగువతోనె దసరా థియేటర్లు నిండిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ దసరాకి అదే జరిగితే మాత్రం దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.