విదేశాల్లో కూడా పుష్ప 2 సునామీ.. మైండ్ బ్లాక్ కలెక్షన్స్..
పాన్ ఇండియా సినిమాల్లో ఒకటైన "పుష్ప 2: ది రూల్" కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది.
By: Tupaki Desk | 6 Dec 2024 7:57 AM GMTపాన్ ఇండియా సినిమాల్లో ఒకటైన "పుష్ప 2: ది రూల్" కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజే, ఈ చిత్రం పలు దేశాల్లో భారీ కలెక్షన్లతో అద్భుతమైన ఆరంభాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, గల్ఫ్ దేశాల్లో కలెక్షన్ పరంగా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది.
ఆస్ట్రేలియాలో పుష్ప 2 విడుదల మొదటి రోజే ఒక మిలియన్ డాలర్ల మార్కును దాటింది. 134 థియేటర్లలో మొదటి రోజు $653,257 వసూలు చేయగా, రెండో రోజు $375,917 కలెక్షన్లు రాబట్టింది. ఈ రేంజ్ కలెక్షన్లు ఆస్ట్రేలియాలో భారతీయ సినిమాలకు ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. ఈ విధంగా కేవలం మరుసటి రోజు మధ్యాహ్నం సమయానికి 1 మిలియన్ మార్కును అందుకుంది, ఇది బిగ్గెస్ట్ రికార్డ్ అనే చెప్పాలి.
న్యూజిలాండ్‌లో, మొదటి రోజు $93,181 వసూలు చేసిన పుష్ప 2, రెండో రోజు కూడా అద్భుతమైన కలెక్షన్లను నమోదు చేసింది. 34 థియేటర్లలో $68,444 వసూళ్లు సాధించి, మొదటి రోజు స్థాయిలోనే రెండో రోజు కూడా కొనసాగించడం విశేషం. ఈ చిత్రం న్యూజిలాండ్‌లో పక్కా హిట్ గా నిలిచే అవకాశం కనిపిస్తోంది. యూకే మరియు ఐర్లాండ్ లో కూడా రెండో అత్యంత పెద్ద ఓపెనింగ్ డే కలెక్షన్ సాధించింది. అక్కడ 484,250 డాలర్లు రాబట్టిన ఈ చిత్రం మార్కెట్లో భారతీయ చిత్రాలకు కొత్త ప్రమాణాలు సెట్ చేస్తోంది. 191 థియేటర్లలో ఈ కలెక్షన్లు సాధించడం విశేషం.
గల్ఫ్ దేశాల్లో కూడా ప్రీమియర్ షోల ద్వారా $500K కలెక్షన్ సాధించింది. ఇంకా చాలా ప్రాంతాల్లో థియేటర్ లెక్కలు అందని కారణంగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అక్కడి అభిమానుల నుంచి ఈ చిత్రానికి పెద్ద ఎత్తున స్పందన రావడం విశేషం. మొత్తానికి, "పుష్ప 2" విదేశీ మార్కెట్లో తనదైన ముద్ర వేశింది. నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా 3.29 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం, మొదటి రోజు 719 థియేటర్లలో 1.11 మిలియన్ కలెక్షన్ సాధించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన మార్కెట్స్ లో ఈ చిత్రం విజయం సాధించడం చూస్తుంటే, ఇది రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సెట్ చేయనుందని అనిపిస్తుంది. "పుష్ప 2: ది రూల్" తో అల్లు అర్జున్ మరోసారి తన స్థాయిని నిరూపించుకున్నాడు.