Begin typing your search above and press return to search.

ఓవర్సీస్ బాక్సాఫీస్.. ఇది హనుమాన్ ఊచకోత సామీ

క్లైమాక్స్ లో వచ్చే హనుమాన్ ఎపిసోడ్ మాత్రం ఆడియన్స్ కి విపరీతంగా కనెక్ట్ అవుతోంది.

By:  Tupaki Desk   |   23 Jan 2024 2:27 PM GMT
ఓవర్సీస్ బాక్సాఫీస్.. ఇది హనుమాన్ ఊచకోత సామీ
X

హనుమాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసి అప్రతిహతంగా దూసుకుపోతోంది. డీసెంట్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో మూవీ కొనసాగుతోంది. ప్రశాంత్ వర్మ మేకింగ్, విజువలైజేషన్ కి అందరూ ఫిదా అయిపోతున్నారు. క్లైమాక్స్ లో వచ్చే హనుమాన్ ఎపిసోడ్ మాత్రం ఆడియన్స్ కి విపరీతంగా కనెక్ట్ అవుతోంది. అందుకే అందరూ బ్రహ్మరథం పడుతున్నారు.

లాంగ్ రన్ లో ఈ మూవీ 300 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందనే మాట ట్రేడ్ పండితుల నుంచి వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే ఈ మూవీ వంద కోట్లకి పైగా కలెక్షన్స్ వసూళ్లు అయినట్లు తెలుస్తోంది. ఇక నార్త్ ఇండియాలో కూడా 60 కోట్ల గ్రాస్ ని టచ్ చేసింది. ఓవర్సీస్ మార్కెట్ లో కూడా జెట్ స్పీడ్ తో హనుమాన్ కలెక్షన్స్ దూసుకుపోతున్నాయి.

రిలీజ్ అయిన అన్ని దేశాలలో మంచి వసూళ్లని అందుకుంటుంది. ఓవరాల్ గా 12 రోజుల్లో 5.51 మిలియన్ డాలర్స్ ని ఈ సినిమా అందుకుంది. అంటే ఇండియన్ కరెన్సీలో 46.65 కోట్లన్న మాట. ఇప్పటి వరకు ఓవర్సీస్ లో కేవలం స్టార్ హీరోల చిత్రాలు మాత్రమే 5 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్ట్ చేశాయి. అయితే చిన్న హీరోలలో ఈ ఫీట్ అందుకున్న మొదటి నటుడు తేజా సజ్జా కావడం విశేషం.

నార్త్ అమెరికాలో - 37.31 కోట్లు

యూకే&ఐర్లాండ్ లో - 2.96 కోట్లు

ఆస్ట్రేలియా - 2.7 కోట్లు

న్యూజిలాండ్ - 26.05 లక్షలు

అరబిక్ కంట్రీస్, గల్ఫ్ దేశాలలో - 2.42 కోట్లు

రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో-1 కోటి కలెక్ట్ చేసింది.

ఓవరాల్ గా ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమా రూ.46.65 కోట్లు వసూళ్లు సాధించింది.

దీనిని బట్టి విదేశాలలో హనుమాన్ కి ఏ స్థాయిలో ఆదరణ వస్తుందో చెప్పొచ్చు. ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకొని ఈ జెనరేషన్ లో వచ్చిన మొట్టమొదటి ఇండియన్ సూపర్ హీరో ఇదే అని చెప్పాలి. భవిష్యత్తులో సూపర్ హీరో సిరీస్ లకి హనుమాన్ తొలిమెట్టు. ఇదిలా ఉంటే ఈ సినిమా కలెక్షన్స్ దేశాల వారీగా చూసుకుంటే ఇలా ఉన్నాయి.