సొంత కథలతో పాన్ ఇండియా సత్తా వీళ్లకే సొంతం!
పాన్ ఇండియాలో టాలీవుడ్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 July 2024 12:30 AM GMTపాన్ ఇండియాలో టాలీవుడ్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్`, `పుష్ప`, `కార్తికేయ-2`, `హనుమాన్`, `సలార్` లాంటి విజయాలతో తెలుగు సినిమా సత్తా ఏంటన్న ది? ఇండియాలోనే కాదు..ప్రపంచానికే తెలిసింది. దానికి ఆజ్యం పోసింది రాజమౌళి అయితే తదుపరి మేకర్స్ ఆ విధానాన్ని సక్సెస్ పుల్ గా కొనసాగిస్తున్నారు. రాజమౌళి స్పూర్తితో మరింత మంది పాన్ ఇండియా మార్కెట్ లో సినిమాలు చేయాలని కొత్త ఆలోచనలతో ముందుకు కదులుతున్నారు.
మరి పాన్ ఇండియాలో సొంత కథలతో సత్తా చాటిన మేకర్స్ ఎంతమంది? అంటే ఇందులో రాజమౌళి పేరు ఉండదు అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన వెనుక గ్రేట్ రైటర్ కమ్ ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ ఉన్నారు కాబట్టి ఆ క్రెడిట్ కేవలం విజయేంద్రుడికి మాత్రమే సొంతం. మేకింగ్ పరంగానే రాజమౌళిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అవసరం మేర రైటింగ్ పరంగా ఇన్ పుట్స్ ఇవ్వొచ్చు. కానీ రైటింగ్ పరంగా రాజమౌళి పాత్ర చాలా తక్కువగానే ఉంటుంది.
ఆయన్ని పక్కనబెడితే సొంత కథలతో పాన్ ఇండియాలో సత్తా చాటిన సిసలైన మేకర్స్ మాత్రం వీళ్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. `కార్తికేయ-2` తో చందు మొండేటి ఎంతటి ప్రతిభావంతుడు అన్నది భారత్ మొత్తం తెలిసింది. అతడు ఎంచుకున్న కాన్సెప్ట్..హిందుత్వం మొండేటికి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చింది.
ఇతని సినిమాలకు సంబంధించి కథల్నీ సొంతంగానే రాసుకుంటారు. రైటర్లపై ఆధారపడరు. అలాగే సుకుమార్ `పుష్ప` కూడా ఇదే కోవకు చెందుతుంది. సుకుమార్ రైటింగ్స్ నుంచే ఆయన కథలు పుడుతుంటాయి. స్టైలిష్ రైటర్ గా సుకుమార్ కి మంచి పేరుంది. యంగ్ మేకర్ ప్రశాంత్ వర్మ కూడా సొంత కథలతోనే సినిమాలు చేస్తాడు. `హనుమాన్` అలా రిలీజ్ అయిన చిత్రమే. కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు చేయడం ఇతని స్పెషాల్టీ.
ఇక ఇటీవల రిలీజ్ అయిన్ `కల్కి 2898` తో నాగ్ అశ్విన్ పాన్ ఇండియాని దాటేసిన సంగతి తెలిసిందే. ఇతడి హాలీవుడ్ మేకర్ అంటూ విమర్శకుల ప్రశంసలందుకుంటున్నాడు. కల్కిని టెక్నికల్ గా హై స్టాండర్స్డ్ సినిమా కావడంతో నాగీలో సిసలైన ట్యాలెంట్ ఇది అంటూ అంతా ప్రశంసిస్తున్నారు.
పురాణ ఇతిహాసాలు ఆధారంగా చేసుకోవడం...దాన్ని మోడ్రన్ డేస్ కి అప్లే చేయడం..సైన్స్ పిక్షన్ గా మలచడం వంటివి నాగ్ అశ్విన్ అసాధారణ మేథస్సు తార్కాణంగా చెప్పొచ్చు.
`కేజీఎఫ్`, `సలార్` లాంటి సినిమాలతో ఫేమస్ అయిన ప్రశాంత్ నీల్ కూడా సొంత కథలతోనే సినిమాలు చేస్తాడన్న సంగతి తెలిసిందే. కన్నడ నటుడైన రిషబ్ శెట్టి `కాంతార`తో తనని తాను పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరిం చుకున్నాడు. మరి వీళ్ల సరసన భవిష్యత్ లో ఇంకెంత మంది మేకర్స్ చేరతారో చూడాలి.