ఓయ్.. టైటిల్ అర్ధమేంటో తెలిస్తే వావ్ అనాల్సిందే.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆనంద్ రంగా ఈ మూవీ గురించి ఇంటరెస్టింగ్ విషయాలని పంచుకున్నారు.
By: Tupaki Desk | 13 Feb 2024 4:30 AM GMTబేబీ షాలినిగా అందరికి సుపరిచితం అయ్యి గుర్తింపు తెచ్చుకున్న అమ్మాయి హీరోయిన్ గా తెలుగులో చేసిన మొదటి సినిమా ఓయ్. ఓ విధంగా ఈ సినిమా మీద అందరూ ప్రత్యేకమైన ఇంటరెస్ట్ చూపించడానికి కారణం కూడా షాలిని లీడ్ రోల్ చేయడమే. అలాగే హీరోగా అప్పటికి లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్న సిద్ధార్ధ్ నటించాడు.
వీరిద్దరి కాంబినేషన్ లో లవ్ స్టోరీగా ఓయ్ సినిమాని ఆనంద్ రంగా తెరకెక్కించారు. ఇప్పటికి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమాల గురించి మాట్లాడుకుంటే ఓయ్ మూవీ గుర్తుకొస్తుంది. చాలా మందికి ఈ సినిమా నచ్చుతుంది. కానీ ఎందుకనో మూవీ ఆ సమయంలో థియేటర్స్ లో సక్సెస్ కాలేదు. 2009లో వచ్చిన ఈ సినిమాని ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజుసందర్భంగా థియేటర్స్ లో రీరిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆనంద్ రంగా ఈ మూవీ గురించి ఇంటరెస్టింగ్ విషయాలని పంచుకున్నారు. నేను ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేసాను. అయిన ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. మణిరత్నం సినిమాల నుంచి స్ఫూర్తి పొంది ఈ మూవీ కథ రాసుకున్న. అందులో హీరోయిన్స్ హీరోని ఓయ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ మూవీ స్టోరీ లైన్ అనుకున్నప్పుడు పరుగు అనే టైటిల్ పెట్టాలని నిర్ణయించుకున్న.
అయితే స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టిన తర్వాత హీరోయిన్ సంధ్య, హీరో ఉదయ్ ని ఓయ్ అని పిలుస్తూ ఉంటుంది. ఇది అందరికి అర్ధమయ్యే చాలా కామన్ నేమ్. వినడానికి కూడా సౌండ్ బాగుంది. ఇంకా ఎక్కువ అబ్జర్వ్ చేస్తే సంధ్యతో ఉదయ్ ప్రేమ కథ 2007 జనవరి 1వ తేదీన అతని పుట్టిన రోజు నాడు స్టార్ట్ అవుతుంది. కథలో సీక్వెన్స్ అన్ని ఫెస్టివల్ మూడ్ లో ట్రావెల్ అవుతూ ఉంటాయి.
క్రిస్మస్ కి సంధ్యకి ఉదయ్ షిప్ లోకి తీసుకెళ్లడం వరకు కొనసాగి డిసెంబర్ 31తో ఎండ్ అవుతుంది. జనవరి 1, 2008న సంధ్య చనిపోతుంది. దాంతో అతను బర్త్ డే సెలబ్రేట్ చేసుకోడు. అలా ఉదయ్ ఫస్ట్ లవ్ వన్ ఇయర్ జర్నీ ఉంటుంది. OY అంటే One Year అని మీనింగ్. అందుకే టైటిల్ ని అలా పెట్టాను అని ఆనంద్ రంగా సుదీర్ఘంగా ఈ మూవీ గురించి రాసుకొచ్చారు. కథలో ఇంత డీటెయిలింగ్ ఉన్న కూడా ఆడియన్స్ కి ఆ టైంలో మూవీ కనెక్ట్ కాకపోవడం గమనార్హం.