Begin typing your search above and press return to search.

ప్లానింగ్ లేకున్నా పర్ఫెక్ట్ సీక్వెల్ ఇచ్చారుగా..!

సీజన్ 1 సూపర్ హిట్ కాగా అది చేసే టైం లో సుదీప్ శర్మాకి సీక్వెల్ ప్లానింగ్ అసలు లేదని వెల్లడించాడు.

By:  Tupaki Desk   |   22 Jan 2025 3:30 PM GMT
ప్లానింగ్ లేకున్నా పర్ఫెక్ట్ సీక్వెల్ ఇచ్చారుగా..!
X

సినిమాలే ఈమధ్య సీక్వెల్ పంథా కొనసాగిస్తున్న ఈ టైం లో వెబ్ సీరీస్ లు ఇవి ఫాలో అవ్వకపోతే ఎలా అనుకుంటున్నారు. అందుకే ముందు స్టాండలోన్ సీరీస్ గా తీసిన కొన్నిటిని అవి సూపర్ హిట్ కాగానే వాటిని పొడిగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల్లో భాగంగానే అమెజాన్ ప్రైమ్ కోసం సుదీప్ శర్మ లేటెస్ట్ గా పాతాల్ లోక్ 2 చేశారు. సీజన్ 1 సూపర్ హిట్ కాగా అది చేసే టైం లో సుదీప్ శర్మాకి సీక్వెల్ ప్లానింగ్ అసలు లేదని వెల్లడించాడు.

ఐతే పాతాల్ లోక్ సీజన్ 1 సూపర్ హిట్ అవ్వడంతో సీజన్ 2 ని చేయాలనే ఆలోచన వచ్చింది. ఐతే పాతాల్ లోక్ స్టాండలోన్ సీరీస్ గా చేయాలనే సీజన్ 1 ని చేశామని అన్నారు సుదీప్ శర్మ. ఐతే సీక్వెల్ అనగానే కాస్త ఆలోచనలో పడ్డా తన టీం తో కలిసి మళ్లీ ఎంతో శ్రమించి పాతాల్ లోక్ 2 తీశానని అంటున్నారు ఆయన. ఒక సీరీస్ హిట్ అయితే ఆ సీరీస్ కు సీక్వెల్ ని కచ్చితంగా ప్లాన్ చేస్తున్నారు.

పాతాల్ లోక్ సీజన్ 1 సక్సెస్ అవ్వగానే సీక్వెల్ కోసం సుదీప్ శర్మని సంప్రదించారు. ఐతే ఆయన సీజన్ 2 కి సిద్ధంగా లేకపోయినా కాస్త టైం ఇవ్వడంతో సీజన్ 2 ని రెడీ చేశారు. రీసెంట్ గా రిలీజైన పాతాల్ లోక్ సీజన్ 2 ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సౌత్ తో పోల్చితే వెబ్ సీరీస్ లను నార్త్ ఆడియన్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అక్కడ సినిమాల సక్సెస్ రేటు కన్నా వెబ్ సీరీస్ ల సక్సెస్ రేటు ఎక్కువగా ఉంది.

పాతాల్ లోక్ 2 సీజన్ 2 కూడా బాలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ప్లానింగ్ అంతగా లేకపోయినా పర్ఫెక్ట్ సీక్వెల్ ఇచ్చి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు సుదీప్ శర్మ. ఐతే సీజన్ 2 కి కొనసాగింపు ఉంటుందా పాతాల్ లోక్ కూడా మిగతా అన్ని వెబ్ సీరీస్ లా కొనసాగుతూనే ఉంటుందా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. బాలీవుడ్ ఆడియన్స్ సినిమాల కన్నా ప్రతి వారం రిలీజ్ అవుతున్న వెబ్ సీరీస్ ల మీద ఎక్కువ ఫోకస్ తో ఉన్నారు. అందుకే అక్కడ వెబ్ సీరీస్ లు అన్ని మాక్సిమం సక్సెస్ లు సాధిస్తున్నాయి.