మరో క్రైమ్ థ్రిల్లర్ రెండో సీజన్ రెడీ..!
ఈ క్రమంలోనే 2020 లో వచ్చిన పాతాళ్ లోక్ వెబ్ సీరీస్ గ్రాండ్ సక్సెస్ అందుకోగా ఇప్పుడు దానికి రెండో సీజన్ సిద్ధం చేశారు.
By: Tupaki Desk | 23 Dec 2024 10:30 PM GMTవెండితెర మీద చెప్పలేని కొన్ని కథలు డిజిటల్ మాధ్యమాల ద్వారా చెబుతుంటారు. అందుకే వెబ్ సీరీస్ లకు ఈ మధ్య భారీ డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ సీరీస్ లకు ఐతే వేరే లెవెల్ డిమాండ్ ఉంటుంది. అందుకే అలాంటి సీరీస్ లను మొదలు పెట్టడమే ఆలస్యం అలా కొనసాగిస్తూ వెళ్తున్నారు. బాలీవుడ్ లో ఇలాంటి వెబ్ సీరీస్ లు వరుసగా వస్తున్నాయి. ఒక సీజన్ హిట్ అవ్వగానే ఏమాత్రం లేట్ చేయకుండా రెండో సీజన్ కి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే 2020 లో వచ్చిన పాతాళ్ లోక్ వెబ్ సీరీస్ గ్రాండ్ సక్సెస్ అందుకోగా ఇప్పుడు దానికి రెండో సీజన్ సిద్ధం చేశారు.
పాతాళ్ లోక్ సీజన్ 2 సైలెంట్ గా ఎప్పుడు మొదలు పెట్టారో ఎప్పుడు పూర్తి చేశారో తెలియదు కానీ రెండో సీజన్ ను జనవరి 17న రిలీజ్ లాక్ చేశారు. పాతాల్ లోక్ సీజన్ 2 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సీరీస్ ను అనుష్క శర్మ నిర్మించారు. పాతాళ్ లోక్ సీరీస్ కథ విషయానికి వస్తే ఒక కేసు విషయంలో వ్యవస్థ లోని లోపాలు చూపిస్తూ సమాజంలోని వివక్ష గురించి చెప్పారు. ఈ సీరీస్ లో జయదీప్ అహ్లావత్ లీడ్ రోల్ చేశారు. విశాల్ త్యాగి, తోప్ సింగ్ కూడా ఈ సీరీస్ లో ఇంపార్టెంట్ రోల్స్ చేశారు.
పాతాళ్ లోక్ సెకండ్ సీజన్ కూడా మరో ఇన్వెస్టిగేషన్ థీమ్ తో వస్తుందని తెలుస్తుంది. ఓటీటీలో ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సీరీస్ లను ఎంతగానో ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. సినిమాల్లోలా పాటలు ఉండవనే ఒక రీజన్ తప్ప సినిమాలను మించిన ట్విస్ట్ లు, కథనం వెబ్ సీరీస్ లో ఉంటున్నాయి. అందుకే సినిమాలకు ఈక్వల్ గా వెబ్ సీరీస్ ల డిమాండ్ పెరుగుతుంది.
పాతాళ్ లోక్ రెండో సీజన్ కూడా మొదటి సీజన్ లా ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని యూనిట్ చెబుతున్నారు. బాలీవుడ్ ఆడియన్స్ కు ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సీరీస్ లు అంటే చాలా ఇష్టం. ఐతే ఎంత థ్రిల్లర్ స్క్రీన్ ప్లే అయినా కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా ఉంటున్నాయి. అందుకే వీటికి ఎప్పటికీ డిమాండ్ అలానే కొనసాగుతుంది. పాతాళ్ లోక్ 2 సీజన్ 1 ని మించి ఉంటుందని మేకర్స్ అంటున్నారు. మరి సీజన్ 2 రిలీజ్ అయ్యాక కానీ ఆ సీరీస్ రిజల్ట్ ఏంటన్నది తెలుస్తుంది.